MLA Kale Yadaiah | షాబాద్, ఆగస్టు 28: ‘గో బ్యాక్ ఎ మ్మెల్యే.. ఎమ్మెల్యే డౌన్ డౌన్’ అంటూ సొంత పార్టీ నాయకుల నుంచి చేవెళ్ల ఎ మ్మెల్యే కాలె యాదయ్యకు నిరసన సెగ తగిలింది. పదేండ్లు కాంగ్రెస్ పార్టీ కోసం కష్టపడిన నాయకులను పక్కన పెట్టి.. తనకు ఇష్టమొచ్చిన వారిని వెంట తిప్పుకొని తమను ఇబ్బందులు పెడుతున్నార ని మండిపడ్డారు. బుధవారం రంగారెడ్డి జిల్లా చేవెళ్ల నియోజకవర్గంలోని షాబాద్ మండలంలో కల్యాణలక్ష్మి, షాదీముబారక్ చెక్కులు పంపిణీ చేయడానికి చేవెళ్ల ఎమ్మెల్యే కాలె యాదయ్య వచ్చారు. అ ప్పటికే కాంగ్రెస్ పార్టీలోని మరో వర్గం నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున మండల పరిషత్తు కార్యాలయం ముం దు నిల్చున్నారు. ఎమ్మెల్యే వాహనం కా ర్యాలయం ముందుకు రాగానే ఒక్కసారిగా ‘ఎమ్మెల్యే డౌన్ డౌన్.. గో బ్యాక్ ఎ మ్మెల్యే’ అంటూ పెద్ద పెట్టున నినదాలు చేశారు.
కోడిగుడ్లు, టామటాలు, వాటర్ బాటిళ్లతో ఎమ్మెల్యే వాహనంపై దాడి చే శారు. పదేండ్ల క్రితం కాంగ్రెస్ పార్టీలో గె లిచి అప్పట్లో అధికారంలో ఉన్న బీఆర్ఎస్లో చేరిన ఎమ్మెల్యే యాదయ్య.. ప దేండ్ల పాటు అక్కడ అన్నీ అనుభవించి.. ఇప్పుడు కాంగ్రెస్ అధికారంలోకి రాగానే మళ్లీ పార్టీలోకి వచ్చారని మండిపడ్డారు. షాబాద్లో కాంగ్రెస్ పార్టీలో రెండు వర్గాలున్నాయని, ఒక వర్గానికి మాత్రమే సమాచారం ఇస్తున్నారని, ఇంకో వర్గాన్ని పట్టించుకోకుండా, వారు చేపట్టే అభివృద్ధి పనుల బిల్లులు నిలిపివేస్తున్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు. సుమారు గంటకు పైగా సొంతపార్టీ నాయకులు, కార్యకర్తలు ఆందోళన చేపట్టడంతో ఎమ్మెల్యే కారు దిగి కిందికి రాలేదు. షాబాద్ సీఐ కాంతారెడ్డి ఆందోళనకారులను సముదాయించారు. పటిష్ట భద్రత మధ్య కార్యాలయంలోకి అడుగుపెట్టిన ఎమ్మెల్యే.. కల్యాణలక్ష్మి లబ్ధిదారులకు కొన్ని చెక్కులు పంపిణీ చేసి వెళ్లిపోయారు. ఎమ్మెల్యే కాలె యాదయ్య బీఆర్ఎస్ పార్టీని వీడి కాంగ్రెస్లో చేరినప్పటి నుంచి.. ఆయన చేతిలో ఓడిపోయిన కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి పామెన భీంభరత్, ఎమ్మెల్యే వర్గానికి పడటం లేదని, దీంతోనే దాడులు జరుగుతున్నాయని పలువురు చర్చించుకుంటున్నారు.