బడంగ్పేట్, అక్టోబర్ 22 : పేదలకు ఆపద సమయంలో అందించాల్సిన సీఎం రిలీఫ్ ఫండ్ విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం జాప్యం చేస్తున్నదని మాజీ మంత్రి, ఎమ్మెల్యే పీ సబితా ఇంద్రారెడ్డి మండిపడ్డారు. మహేశ్వరం నియోజకవర్గంలోని పలువురికి బుధవారం ఆమె సీఎంఆర్ఎఫ్ చెక్కులను అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఆపదలో ఉన్న వారిని కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉన్నదని పేర్కొన్నా రు.
సీఎంఆర్ఎఫ్ నుంచి ప్రజలకు పారదర్శకంగా సహాయం అందడం లేదని ఆందోళన వ్యక్తం చేశారు. గత కేసీఆర్ పాలనలో అర్హులైన ప్రతి ఒక్కరికీ సీఎంఆర్ఎఫ్ పారదర్శకంగా అందించామని, తాత్సారం చేయలేదని గుర్తుచేశారు. కానీ రేవంత్ సర్కారు ప్రతి అంశంలో రాజకీయం చేస్తున్నదని ధ్వజమెత్తారు. కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న మోసాన్ని ప్ర జలు గమనిస్తున్నారని రానున్న రో జుల్లో వారే తగిన బుద్ధి చెప్తారని పేర్కొన్నారు.