కొండపాక (కుకునూర్‌పల్లి), జూన్ 5 : పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరి బాధ్యత అని సిద్దిపేట జిల్లా హరిత సేన ఇంచార్జ్ చెప్యాల రాజేశ్వర్ రావు అన్నారు. ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా గ్రీన్ ఇండియా ఛాలెంజ్ వ్యవస్థాపకులు జోగినపల్లి సంతోష్ కుమార్ పిలపు మేరకు కొండపాక మండలం తిమ్మారెడ్డి పల్లిలో గురువారం హరితసేన ఆధ్వర్యంలో పాఠశాల అవరణలో మొక్కలు నాటారు.
ఈ సందర్భంగా రాజేశ్వర్‌రావు మాట్లాడుతూ మొక్కలు నాటడం వల్లే పర్యావరణ పరిరక్షణ జరుతుందన్నారు. నాటిన మొక్కలను ప్రజలు సంరక్షించాలని కోరారు. కార్యక్రమంలో గజ్వేల్ నియోజకవర్గం కోఆర్డినేటర్ అనిల్, బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు బాలచందర్ గౌడ్, భాస్కర్, కనక సేన, నందు ఉపాధ్యాయులు పాల్గొన్నారు.