హైదరాబాద్, ఏప్రిల్ 12 (నమస్తే తెలంగాణ)ః తిరుమలలో అతిధి గృహాన్ని నిర్మించి విరాళంగా ఇచ్చేందుకు ఓ సంస్థ రికార్డు స్థాయిలో చెల్లించింది. హెచ్వీడీసీలోని 493 గదుల అతిధి గృహం నిర్మాణానికి అధికారులు తిరుమలలోని రెవెన్యూ కార్యాలయంలో టెండర్లు నిర్వహించారు. ఇందులో చెన్నైకు చెందిన జీస్కేర్ రియల్టర్స్ సంస్థ రూ.25,77,77,777ను విరాళంగా కోట్ చేసింది.
నిబంధనల ప్రకారం ఈ సొమ్మంతా టీటీడీకి విరాళంగా వెళ్లనుంది. తిరుమలలో వసతి గదులు, అతిధి గృహాల నిర్వహణలో టీటీడీ వేగంగా నిర్ణయాలు తీసుకుంటుంది. కొత్త వాటి నిర్మాణంతో పాటుగా కొనసాగుతున్న వసతి గృహాల మరమ్మత్తులు చేపట్టింది. అందులో భాగంగా ఇప్పుడు హెచ్వీడీసీలోని 493 అతిధి గృహం నిర్మాణానికి రికార్డు స్థాయిలో విరాళం అందింది. దీనిని దాత సొంత ఖర్చులతో నిర్మించి దేవస్థానానికి అందించాలి.