సారంగాపూర్, సెప్టెంబర్ 13 : నిజామాబాద్ రూరల్ మండలంలోని మల్కాపూర్(ఏ) గ్రామ శివారులో చిరుత సంచారం కొన్నిరోజులుగా కలకలం సృష్టిస్తున్నది. నెలరోజుల నుంచి ఇదే ప్రాంతంలో చిరుత సంచరిస్తుండటంతో గ్రామస్థులు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు.
ఓ రైతు తన పొలం నుంచి కూలీలతో కలిసి టిప్పర్లో శుక్రవారం వేకువజామున వస్తుండగా చిరుత కనిపించింది. గమనించిన కూలీలు తమ సెల్ఫోన్లలో చిరుత సంచరిస్తున్న దృశ్యాలు చిత్రీకరించి వాట్సాప్ గ్రూప్లో పోస్టు చేశారు.
జూరాల డ్యాం రోడ్డుపై మొసలి
వనపర్తి జిల్లా అమరచింత మండలంలోని జూరాల ప్రాజెక్టు రోడ్డుపై శుక్రవారం ఉదయం మొసలి సంచరించింది. మత్స్యకారులు మొసలిని తాళ్లతో బంధించి ప్రాజెక్టులో వదిలిపెట్టారు. నెల రోజులుగా కురుస్తున్న వర్షాలతో ప్రాజెక్టుకు భారీగా వరద రావడంతో మొసళ్లు బయటకు వచ్చి సంచరిస్తున్నాయి.
– అమరచింత