వేములవాడ రూరల్, జనవరి 9 : రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ రూరల్ మండలం మల్లారం చెక్‌డ్యామ్‌పై ఉన్న రక్షణ గోడను కూల్చివేసిన ఘటనలో ఇరిగేషన్ అధికారులు తప్పును సరిదిద్దే పనిలో పడ్డారు. చెక్‌డ్యామ్ కూల్చివేతపై శుక్రవారం ‘నమస్తే’లో వచ్చిన కథనాలకు స్పందించారు.
ఇరిగేషన్ అధికారుల ఆదేశాల మేరకు గ్రామ పంచాయతీ పాలకవర్గం సూచనతో చెక్‌డ్యామ్‌పై తిరిగి కొత్త రక్షణ గోడను నిర్మించారు. వేములవాడ తహసీల్దార్ అబూబకర్, వేములవాడ రూరల్ ఎస్ఐ వెంకట్రాజం చెక్‌డ్యామ్ రక్షణ గోడను పరిశీలించారు. ఎలాంటి ఫిర్యాదు రాకపోవడంతో కేసు నమోదు చేయలేదని ఎస్ఐ తెలిపారు. ఇరిగేషన్ డీఈని సంప్రదించగా, తాను హైదరాబాద్‌కు వెళ్లినట్టు చెప్పారు.