గతంలో చిన్న చిన్న గొడవలైనా హైదరాబాద్ నగరంలో దుకాణాలు మూయాల్సి వచ్చేది. గత ప్రభుత్వాలు శాంతిభద్రతలను అదుపు చేయడంలో విఫలమయ్యాయి. ఉమ్మడి పాలకులు ప్రజలు, వ్యాపారుల శ్రేయస్సును పట్టించుకున్న పాపాన పోలేదు. నగరంలో వ్యాపారులకు అనుకూలమైన వాతావరణాన్ని కల్పించింది తెలంగాణ ప్రభుత్వమే. ప్రత్యేక రాష్ట్రంలో హింసాయుత పరిస్థితులకు చెక్ పెట్టారు. ప్రభుత్వం శాంతిభద్రతల విషయంలో రాజీ లేకుండా పని చేస్తున్నది.
అన్నివర్గాల ప్రజలు స్వేచ్ఛగా జీవించేందుకు అనుకూల నగరంగా మారింది. ఇది ముమ్మాటికీ కేసీఆర్ సర్కార్ ఘనతే. ముఖ్యంగా దక్షిణ భారతదేశంలోనే స్వర్ణాభరణాల వ్యాపారానికి హైదరాబాద్ పేరుగాంచింది. దుకాణదారులు, వ్యాపారులకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ చర్యలు తీసుకుంటున్నారు. ఉత్తరాది వ్యాపారులంతా బీఆర్ఎస్ ప్రభుత్వానికి, ముఖ్యమంత్రి కేసీఆర్‌కు రుణపడి ఉంటాం. కారు గుర్తుకే ఓటేస్తాం.
-గులాబ్‌సింగ్, బంగారం వర్తకుడు