యాదాద్రి భువనగిరి : యాదాద్రిలో పార్కింగ్ ఫీజు నిబంధనల్లో అధికారులు స్వల్ప మార్పులు చేశారు. రూ. 100 అదనపు రుసుం నిబంధనను ఎత్తివేస్తున్నట్లు అధికారులు ప్రకటించారు. నాలుగు చక్రాల వాహనాలకు గంటకు రూ. 500 ఫీజు యథాతథంగా కొనసాగుతోందని స్పష్టం చేశారు.
యాదాద్రి కొండపైకి వెళ్లే వాహనాలకు గంటకు రూ.500 రుసుం వసూలు చేయనున్నట్టు ఆలయ ఈవో ఎన్ గీత ఇటీవల ప్రకటించిన సంగతి తెలిసిందే. నిత్యం 50 నుంచి 70 వాహనాలు కొండపైకి వస్తున్నట్టు గుర్తించిన అధికారులు ఇటీవల నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నట్టు శనివారం వెల్లడించారు. కొండపైకి వాహనాల అనుమతికి గంటకు రూ.500 రుసుంతోపాటు గంట దాటితే ప్రతి గంటకు అదనంగా రూ.100 వసూలు చేయనున్నట్టు స్పష్టంచేశారు. కొండపైన స్థలాభావం కారణంగా అధిక సంఖ్యలో వాహనాలకు కొండపైకి చేరకుండా నివారించేందుకు ఈ ఉత్తర్వులు జారీ చేస్తున్నట్టు వివరించారు. అయితే అదనంగా రూ. 100 వసూలు చేసే నిబంధనను ఎత్తివేశారు.