బంజారాహిల్స్,మే 12: ఏపీలో చంద్రబాబునాయుడు గెలవాలని ఓ వ్యక్తి నాలుక కోసుకున్న ఘటన బంజారాహిల్స్ పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. పశ్చిమగోదావరి జిల్లాకు చెందిన చెవల మహేశ్ ఆదివారం శ్రీనగర్‌కాలనీలోని శ్రీ వేంకటేశ్వరస్వామి ఆలయం సమీపంలో బ్లేడ్‌తో నాలుక కోసుకున్నాడు. ఏపీలో సీఎంగా చంద్రబాబు, పిఠాపురంలో పవన్‌కల్యాణ్ భారీ మెజార్టీతో గెలవాని స్వామివారికి మొక్కుకున్నానని చెప్పాడు. సమాచారం అందుకున్న బంజారాహిల్స్ పోలీసులు అక్కడకు చేరుకుని మహేశ్‌ను దవాఖానకు తరలించారు. గతంలో తాను ఏపీ సీఎంగా జగన్ గెలవాలని ఇదే విధంగా నాలుక కోసుకుని మొక్కుకున్నానని, వైఎస్ఆర్ కోసం కూడా మొక్కుకున్నానని ఓ లేఖలో మహేశ్ పేర్కొన్నాడు.