హైదరాబాద్, నవంబర్ 13 (నమస్తే తెలంగాణ) : ఏపీ సీఎం చంద్రబాబునాయుడు (Chandrababu Naidu) మరోసారి తనదైన శైలిలో వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఈ సారి వైద్యులపై నోరు పారేసుకున్నారు. బుధవారం ఏపీలోని అన్నమయ్య జిల్లా దేవగుడిపల్లిలో ఇండ్ల గృహప్రవేశాల కార్యక్రమంలో మాట్లాడుతూ ‘డాక్టర్లకు హాఫ్ నాలెడ్జ్.. రోగం ఒకటైతే చికిత్స ఒకటి చేస్తున్నారు. డాక్టర్ల వల్ల లేనిపోని సమస్యలు వస్తున్నాయి. వైద్యులు సరిగ్గా చికిత్స చేయకున్నా.. సరైన మందులు ఇవ్వకున్నా ప్రమాదంలో పడ తాం. రానున్న రోజుల్లో అందరినీ ఆన్లైన్లో పెట్టి, పేషెం ట్ల సమస్యలను కృత్రిమ మేధ (ఏఐ) ద్వారా సరైన వైద్య సౌకర్యాలు ఏర్పాటు చేస్తాం’ అని తెలిపారు. రోజుకో తీరుగా చిత్ర విచిత్ర వ్యాఖ్యలు చేస్తున్న చంద్రబాబును నెటిజన్లు ఆడుకున్నారు.
వైద్యం కోసం ఏఐ మీద ఆధారపడొద్దని నిపుణులు సూచిస్తుంటే బాధ్యతాయుతమైన సీఎం పదవిలో ఉండి, ప్రజలను తప్పుదోవ పట్టించేలా మాట్లాడటమేంటని మండిపడుతున్నారు. డాక్టర్లకు వెంటనే క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు. బాబుకు ఏదో అయింది.. మంచి చికిత్స అందించా లి అం టూ చురకలు అంటిస్తున్నారు. చంద్రబాబు కు వయసుతో పాటు పిచ్చి కూడా ముదిరిందని వ్యం గ్యాస్ర్తాలు సంధిస్తున్నారు. హైదరాబాద్‌ను ప్రపంచ పటంలో పెట్టానంటూ ఊదరగొట్టినప్పుడే బాబు మానసిక పరిస్థితిపై సందేహాలు కలిగాయని కొంద రు విమర్శిస్తున్నారు. రెండు రోజుల క్రితం ఏకంగా హైదరాబాద్ బిర్యానీని ప్రమోట్ చేసింది, ఓల్డ్‌సిటీ లో ముత్యాల షాపింగ్‌ను ప్రమోట్ చేసింది తానేనని చెప్పుకున్నారు. తనవల్లే హైదరాబాద్ ముస్లింలు కోటీశ్వరులయ్యారని స్వీయ కితాబులు ఇచ్చుకున్నారు. ప్రజలు సెల్ఫోన్లు వాడటానికి తానే కారణమని చెప్పుకునే దశ నుంచి.. డాక్టర్లకు తెలివిలేదనే దశకు బాబు మానసిక పరిస్థితి దిగజారిందని, చికిత్స అత్యవసరమని సెటైర్లు వేస్తున్నారు.