హైదరాబాద్, ఏప్రిల్ 13 (నమస్తే తెలంగాణ): సమాజంలో మహిళలపై లైంగికదాడులు, వేధింపులు నిత్యకృత్యమయ్యాయని చంచల్‌గూడ జైలు సూపరింటెండెంట్ శివకుమార్ గౌడ్ అన్నారు. ఆదివారం ఎర్రమంజిల్‌లోని ‘సేవ్‌ది గర్ల్ చైల్డ్’ కార్యాలయంలో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. మహిళలపై వేధింపులు జరగకుండా.. మంచి సమాజ స్థాపన కోసం పాటుపడాల్సిన బాధ్యత ప్రతి ఒకరిపై ఉన్నదని స్పష్టం చేశారు.
‘సేవ్ ది గర్ల్ చైల్డ్’ సంస్థ ద్వారా రాష్ట్రవ్యాప్తంగా ప్రతి జిల్లాలో కమిటీలు ఏర్పాటు చేసి బాలికలు, మహిళలకు భరోసా కల్పిస్తామని తెలిపారు. ముఖ్యంగా కళాశాలల యువత మహిళలను గౌరవించేలా కృషి చేస్తామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో రాజేంద్ర పల్నాటి, మారియా ఆంథోని, గీతానంద్, శరణ్య, అపర్ణ, సునీత, ప్రియాంక, కొన్నె దేవేందర్, రమేశ్‌బాబు, వీ గంగాధర్, హరిప్రకాశ్, ప్రశాంత్, వంశీకృష్ణ, నాగేంద్ర తదితరులు పాల్గొన్నారు.