హైదరాబాద్, సెప్టెంబర్ 14(నమస్తే తెలంగాణ): బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌పై భువనగిరి ఎంపీ చామల కిరణ్‌కుమార్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలు గర్హనీయమని బీఆర్ఎస్వీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు తుంగ బాలు పేర్కొన్నారు. ‘కేటీఆర్‌ను నిరుద్యోగులు ఎందుకు నిలదీయాలి.. విద్యార్థులు, నిరుద్యోగుల పక్షాన మాట్లాడినందుకా? గ్రూప్-1పై జ్యుడీషియల్ కమిషన్ వేయమన్నందుకా?
ఏటా రెండు లక్షల ఉద్యోగాలు భర్తీ చేయమన్నందుకా? జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేయమన్నందుకా?’అని ఆదివారం ఒక ప్రకటనలో ప్రశ్నల వర్షం కురిపించారు. అ యినా యూత్ డిక్లరేషన్ పేరిట అనేక హామీలు ఇచ్చి నట్టేట ముంచిన కాం గ్రెస్ అగ్రనేత రాహుల్‌గాంధీ, సీఎం రేవంత్‌ను నిలదీసేందుకు నిరుద్యోగు లు సిద్ధంగా ఉన్నారని హెచ్చరించారు.
కరీంనగర్ తెలంగాణచౌక్, సెప్టెంబర్ 14: కామారెడ్డి డిక్లరేషన్‌లో బీసీలకు ఇచ్చిన హామీలను అమలు చేసిన తర్వాతనే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని రిటైర్డ్ ఐఏఎస్ అధికారి చిరంజీవులు డిమాండ్ చేశారు. కరీంనగర్‌లోని పద్మశాలీ సంక్షేమ భవనంలో ఆదివారం నిర్వహించిన బీసీ రాజ్యాధికార సభకు ఆయన హాజరై మాట్లాడారు.
బీసీలు విద్య, ఉద్యోగ, రాజకీయ రంగా ల్లో అన్యాయానికి గురవుతున్నారని ఆ వేదన వ్యక్తంచేశారు. బీసీలను చైతన్యం చేసేందుకు అన్ని జిల్లాల్లో బీసీ సభలను నిర్వహిస్తున్నట్టు పేర్కొన్నారు. బీసీల ఐక్య డిమాండ్‌తోనే రాష్ట్ర ప్రభుత్వం కులగణన చేపట్టిందని గుర్తుచేశారు. రాజ్యాంగంలోని తొమ్మిదో షెడ్యూల్లో చేర్చడంతోనే బీసీలకు 42శాతం రిజర్వేషన్ సాధ్యపడుతుందని స్పష్టంచేశారు.