హనుమకొండ చౌరస్తా, డిసెంబర్ 6 : గ్రేటర్ వరంగల్ 5వ డివిజన్లోని హనుమాన్‌నగర్ ఫేజ్-1 కాలనీలో భారత రాజ్యాంగ నిర్మాత భారతరత్న అవార్డు గ్రహీత బీఆర్ అంబేద్కర్ 69వ వర్ధంతిని ఘనంగా నిర్వహించారు. అంబేద్కర్ చిత్రపటానికి బీఆర్ఎస్ జిల్లా నాయకుడు చల్లా వెంకటేశ్వర్‌రెడ్డి పూలమాలవేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..ఆర్టికల్-3 ద్వారా తెలంగాణ రాష్ర్ట ఏర్పాటుకు మార్గం సుగమం చేసిన మహనీయుడు అంబేద్కర్ అని గుర్తుచేశారు.
అణగారిన వర్గాల అభ్యున్నతి, అసమానతలులేని సమాజం కోసం అంబేద్కర్ చేసిన పోరాటం మరువలేనిదన్నారు. వారి స్ఫూర్తి ప్రస్తుత, భవిష్యత్ తరాలకు అందించేలా కేసీఆర్ హైదరాబాద్‌లో 125 అడుగుల అంబేద్కర్ విగ్రహాన్ని నెలకొల్పారని, అంబేద్కర్ ఆశయాలను కొనసాగించాలన్నారు. ఈ కార్యక్రమంలో సిరిమల్లె ప్రవీణ్, మొట్ల శ్రీనివాస్, రాజ్‌కుమార్, వెంకటేష్, రవికిరణ్, దికొండ సాంబయ్య, ప్రదీప్, సతీష్, వినోద్, సురేష్, నవీన్ పాల్గొన్నారు.