TGPSC | హైదరాబాద్, నవంబర్ 11 (నమస్తే తెలంగాణ) : రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీచేసే టీజీపీఎస్సీ త్వరలోనే సగం ఖాళీకానుంది. కమిషన్ చైర్మన్ మహేందర్‌రెడ్డి 62 ఏండ్లు పూర్తి చేసుకోనుండటంతో ఆ పదవి నుంచి రిటైర్మెంట్ పొందనున్నారు. ఆ తర్వాత మూడు, నాలుగు నెలల వ్యవధిలోనే కమిషన్ సభ్యురాలు అనితారాజేంద్ర, ఆ తర్వాత రామ్మోహన్రావు వరుసగా పద వీ విరమణ పొందనున్నారు. దీంతో టీజీపీఎస్సీ సగానికి పైగా ఖాళీకానుంది. ఏడాదిన్నర తర్వాత ప్రొఫెసర్ నర్రి యాదయ్య పదవీ విరమణ పొందుతారు. ఇప్పుడున్న సభ్యుల్లో కేవలం అమీరుల్లాఖాన్, పాల్వా యి రజినీకుమారి మాత్రమే ఎక్కువకాలం పదవిలో ఉండనున్నారు.
కొత్త చైర్మన్ కోసం దరఖాస్తుల స్వీకరణ
చైర్మన్ మహేందర్‌రెడ్డి పదవీ విరమణ పొందనున్న నేపథ్యంలో కొత్త చైర్మన్ నియామక ప్రక్రియను ప్రభుత్వం ప్రారంభించిం ది. సోమవారం నోటిఫికేషన్‌ను విడుదల చే సింది. దరఖాస్తులను www.telangana. gov. in వెబ్సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకోవాలని సూచించింది. దరఖాస్తులను prlsecy-sec. gpmgad@telangan a.gov.in వెబ్‌సైట్‌కు 20 సాయంత్రం 5గంటలోగా సమర్పించాలని సూచించింది. చైర్మన్‌కు మాత్రమే నోటిఫికేషన్‌ను జారీచేయగా, కొత్త సభ్యుల నియామకం ప్రస్తావనే లేదు. అంటే సభ్యుల నియామకం అటకెక్కినట్టేనా అన్న ప్రచారం జరుగుతున్నది.