హైదరాబాద్, ఏప్రిల్14 (నమస్తే తెలంగాణ): దళితుల ప్రగతిలో భాగంగా పరిశోధనా, శిక్షణ, ఇతర చైతన్య కార్యక్రమాల కోసం నిర్మించిన దళిత అధ్యయనాల కేంద్రం (సీడీఎస్) ప్రారంభానికి అన్నివిధాలుగా సిద్ధంగా ఉన్నదని చైర్మన్ మల్లేపల్లి లక్ష్మయ్య వెల్లడించారు. ఈ మేరకు సోమవారం ఒక ప్రకటన విడుదల చేశారు. అధ్యయన కేంద్రానికి ప్రభుత్వం తాళం వే సిందనే వార్తల్లో ఎలాంటి నిజం లేదని పేర్కొన్నారు.
అంబేద్కర్ జయంతిని పురస్కరించుకుని ప్రారంభించాలని ప్రభుత్వం నిర్ణయించి.. సలహాలు, సూచనలు చేసిందని తెలిపారు. హైదరాబాద్ నగర పరిధిలో ఎమ్మెల్సీ కోడ్ కారణంగానే ప్రారంభోత్సవాన్ని తాత్కాలికంగా వాయిదా వేసిందని పేర్కొన్నారు.