రసాభాసగా పాడి రైతుల చెక్కుల పంపిణీ
యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరులోని పాల శీతలీకరణ కేంద్రంలో బుధవారం నిర్వహించిన మదర్ డెయిరీ చెక్కుల పంపిణీ కార్యక్రమం రసాభాసగా మారింది. వేదికపై ఉన్న ఆలేరు ఎమ్మెల్యే బీర్ల అయిలయ్య బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలోనే మదర్ డెయిరీ అప్పుల్లో కూరుకుపోయిందని విమర్శలుచేయగా.. మదర్ డెయిరీ మాజీ చైర్మన్ లింగాల శ్రీకర్‌రెడ్డి తీవ్ర అభ్యంతరం తెలిపారు.
- ఎమ్మెల్యే వ్యాఖ్యలను తిప్పికొట్టిన మదర్ డెయిరీ మాజీ చైర్మన్
- కేసీఆర్ హయాంలో పాడి రైతులకు 2వేల కోట్లు పంపిణీ
- మదర్ డెయిరీ మాజీ చైర్మన్ లింగాల శ్రీకర్‌రెడ్డి వెల్లడి
ఆలేరు టౌన్, మే 13 : యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరులోని పాల శీతలీకరణ కేంద్రంలో బుధవారం నిర్వహించిన మదర్ డెయిరీ చెక్కుల పంపిణీ కార్యక్రమం రసాభాసగా మారింది. వేదికపై ఉన్న ఆలేరు ఎమ్మెల్యే బీర్ల అయిలయ్య బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలోనే మదర్ డెయిరీ అప్పుల్లో కూరుకుపోయిందని విమర్శలుచేయగా.. మదర్ డెయిరీ మాజీ చైర్మన్ లింగాల శ్రీకర్‌రెడ్డి తీవ్ర అభ్యంతరం తెలిపారు. ఆయన ఆరోపణలను తిప్పికొట్టారు. ఈ సందర్భంగా శ్రీకర్‌రెడ్డి మాట్లాడుతూ.. తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ హయాంలో పాడి రైతుల అభ్యున్నతి కోసం రూ.2 వేల కోట్లు ఇచ్చినట్టు స్పష్టంచేశారు.
చిట్యాలలోని 30 ఎకరాల స్థలాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం అమ్మకానికి పెడితే దాన్ని అమ్మకుండా తాను కేసు వేసినట్టు తెలిపారు. అందువల్లే డెయిరీ ఆస్తుల అమ్మకం నిలిచిపోయిందని గుర్తుచేశారు. ప్రభుత్వం మళ్లీ రాజీకి వస్తే ఉద్యోగులు, రైతుల ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని కేసు విత్‌డ్రా చేసుకుంటే.. ఎన్డీడీబీ రూ.10 కోట్లు ఇచ్చిందని చెప్పారు. రూ.10 కోట్లకే ప్రస్తుత ప్రభుత్వం ఆర్భాటం చేయడం విడ్డూరంగా ఉన్నదని మండిపడ్డారు. కేసీఆర్ రూ.2వేల కోట్లు కేటాయించి ప్రతి పాడి రైతుకూ బర్రెలు, గొర్రెలు, పశుదాణా అందించిన రోజున కూడా తాము ఇంత ఆర్భాటం చేయలేదని తెలిపారు. తమ హయాంలో అవినీతి జరిగిందని నిరూపిస్తే సీబీఐ విచారణకు సిద్ధమని ఎమ్మెల్యేకు సవాల్ విసిరారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
IndiGo | సౌదీపై హౌతీ దాడుల ఎఫెక్ట్.. రియాద్, జెద్దా నుంచి విమానాలు రద్దు చేసిన ఇండిగో
Train | డిసెంబర్ 4న విజయ్ సేతుపతి ‘ట్రైన్’.. నితిన్, నాగచైతన్య సినిమాలకు గట్టి పోటీ!
Bathukamma Celebrations | దుబాయ్‌లో GTF ఆధ్వర్యంలో అంగరంగ వైభవంగా బతుకమ్మ సంబరాలు.. ఫొటోలు
Congress | కాంగ్రెస్ ప్రభుత్వం రైతుల భూములను బలవంతంగా లాక్కుంటున్నది : సబితా ఇంద్రా రెడ్డి
ICC Player of the Month: శుభమన్ గిల్‌కు అయిదోసారి.. షఫాలీ వర్మకు రెండోసారి
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

