సిటీబ్యూరో, ఆగస్టు 24 (నమస్తే తెలంగాణ): తెలంగాణలో అర్చక ఉద్యోగుల సమస్యలను ప్రభుత్వం దృష్టికి ఎప్పటికప్పుడు తీసుకెళ్తున్నామని, ఇటీవల కొన్ని డిమాండ్లను దేవాదాయశాఖ అర్చ క వెల్ఫేర్ ఫండ్ ద్వారా నెరవేర్చిందని, అయితే అర్చకులకు ఇన్సూరెన్స్ సదుపాయాన్ని కల్పించాలని తెలంగాణ అర్చక ఉద్యోగ జేఏసీ చైర్మన్ గంగు ఉపేంద్రశర్మ డిమాండ్‌చేశారు. అయితే దేవాలయాల ఆదాయం పెంచే దిశగా అర్చకులు సైతం కృషి చేయాలని పిలుపునిచ్చారు. హబ్సిగూడలోని రామాలయంలో ఆదివారం తెలంగాణ అర్చక సమాఖ్య రాష్ట్ర కార్యవర్గ సమావేశాన్ని నిర్వహించారు.
ఈ సందర్భంగా గంగు ఉపేంద్రశర్మ మాట్లాడుతూ ప్రతీ అర్చకుడు స్వతంత్రంగా ఎదగాలని, అర్చక సంఘాల్లో బీసీలకు ప్రా ధాన్యం ఇచ్చామని తెలిపారు. ధూపదీప నైవేద్య పథకంలో కొందరు డబ్బులు వసూలు చేసినట్టు తెలిసిందని, అలా చే యడం సరికాదని పేర్కొన్నారు. అర్చకుల హక్కులు, సంక్షేమం, ఆలయాల అభివృద్ధిపై పలు తీర్మానాలు చేశారు.
అర్చక సమాఖ్య రాష్ట్ర అధ్యక్షుడు గట్టు శ్రీనివాసాచార్యులు, వర్కింగ్ ప్రెసిడెంట్ ఆనంద్‌శర్మ, డీడీఎన్ఎస్ అర్చక సమాఖ్య రాష్ట్ర అధ్యక్షుడు పెరంబుదూరి శ్రీకాంత్‌స్వామి, పెన్నా మోహన్‌శర్మ, శఠగోపం శ్రీనివాసాచార్యులు, అర్చక వెల్ఫేర్ ఫండ్ సభ్యుడు జక్కాపురం నారాయణ, శ్రీనివాస్ సుదర్శన్, శ్రీకోటి జలంధర్ పాల్గొన్నారు.