పాల కంటే పన్నీరుకే విలువెక్కువ. ఓ పదార్థం మరో పదార్థంగా రూపాంతరం చెందితే దాని విలువ పెరుగుతుంది. ఈ విషయాన్ని గ్రహించిన తెలంగాణ ప్రభుత్వం ఆహార ఉత్పత్తులకు విలువను జోడిస్తూ వ్యవసాయ అనుబంధ రంగాల బలోపేతానికి కృషి చేసింది. ఆహారశుద్ధి పరిశ్రమలను నెలకొల్పి నిరుద్యోగులకు ఉపాధి కల్పిస్తూనే పాటు రైతన్నలకు లాభం చేకూర్చింది. ఆహారశుద్ధి రంగం ఎదుగుదలకు తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న చర్యలను సీఐఐ (తెలంగాణ అగ్రి అండ్ ఫుడ్ ప్రాసెసింగ్)
-చైర్మన్ డా. వి రంగయ్య వివరించారు.
ఆహారశుద్ధి రంగంలో తెలంగాణ అగ్రగామిగా ఎదుగుతున్నది. వ్యవసాయ ఉత్పత్తులు పెరగడంతో దానికి అనుబంధంగా ఉండే ఆహారశుద్ధి రంగం విప్లవాత్మక వృద్ధిని సాధిస్తున్నది. దేశీయ కన్ఫెక్షనరీ, బిస్కెట్ ఉత్పత్తుల్లో 60 శాతం వాటా తో హైదరాబాద్ ఈ పరిశ్రమకి ప్రధాన కేంద్రంగా మారింది. అంతేకాదు, ఎగుమతుల్లో 50 శాతం వాటా మన రాష్ర్టానిదే. సీఎం కేసీఆర్ దూరదృష్టి ఫలితం గా తెలంగాణ అటు వ్యవసాయం, ఇటు వ్యవసాయ అనుబంధ రంగాల్లో తనదైన ముద్ర వేస్తున్నది’ అని అన్నారు సీఐఐ (తెలంగాణ అగ్రి అండ్ ఫుడ్ ప్రాసెసింగ్) చైర్మన్ డాక్టర్ వీ రంగయ్య.
జ. తెలంగాణ ప్రభుత్వం నిర్మించిన నీటి పారుదల ప్రాజక్టులతో వ్యవసాయ రంగంలో విప్లవాత్మక మార్పులొచ్చాయి. రాష్ట్ర జీడీపీలో వ్యవసాయం, అనుబంధ రంగాల వాటా సుమారు 25 శాతంగా ఉంది. ఇది జాతీయ సగటు కన్నా అధికం. లైవ్‌స్టాక్, ఆగ్రో ప్రాసెసింగ్, దాని అనుబంధ రంగాల్లోనూ గణనీయమైన వృద్ధిని సాధించింది. వ్యవసాయాభివృద్ధికి హరిత విప్లవం, డెయిరీ రంగ అభివృద్ధికి శ్వేత విప్లవం, చేపల పెంపకానికి నీలి విప్లవం, మాంసం ఉత్పత్తుల పరిశ్రమ అభివృద్ధికి గులాబీ విప్ల వం, వంట నూనెల పరిశ్రమ వృద్ధికి పసుపు (ఎల్లో) విప్లవాలు చేపట్టింది. వీటిని సాకారం చేసేందుకు పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ ఎంతగానో కృషి చేస్తున్నారు.
జ. రాష్ట్రంలో 35శాతం విస్తీర్ణంలో వరి సాగు జరుగుతున్నది. పత్తి, మొక్కజొన్న, పప్పుధాన్యాలు, నూనెగింజలు, మిర్చి, మామిడి తదితర పంటల అనుబంధ పరిశ్రమలకు ఢోకా లేదు. మన రాష్ట్రంలో మేలి రకం పత్తి ఉత్పత్తి అవుతుండడంతో యంగ్వన్, కిటెక్స్ వంటి అంతర్జాతీయ స్థాయి కంపెనీలు ఇక్కడ పరిశ్రమలను ఏర్పాటు చేస్తున్నాయి. పామాయిల్ సాగు, పండ్లతోటల అనుబంధ పరిశ్రమల ముడిసరుకు లభ్యత కూడా బాగానే ఉన్నది.
జ. ప్రభుత్వం అందిస్తున్న ప్రోత్సాహకాలతో తెలంగాణ పౌల్ట్రీ రంగం గణనీయంగా వృద్ధి సాధించింది. హాట్సన్, హెరిటేజ్, జెర్సీ క్రీమ్ లైన్, దొడ్ల తదితర కంపెనీలు డెయిరీ రంగంలో పెట్టుబడులు పెట్టాయి. ప్రభుత్వ రంగంలోని విజయ డెయిరీ తమ రెండో ప్లాంటును కూడా ఇటీవలే ప్రారంభించింది. గొర్రెల పంపిణీ పథకంతో మాంసం ఎగుమతి చేసే స్థాయికి రాష్ట్రం ఎదిగింది.
జ. ఇక్రిశాట్, ఎన్ఐఎన్, ఎన్‌ఏఏఆర్‌ఎం తదితర సంస్థలతో పాటు వ్యవసాయ విశ్వవిద్యాలయం, వెటర్నరీ విశ్వవిద్యాలయం, హార్టికల్చర్ విశ్వవిద్యాలయం తదితర విద్యాసంస్థలు నూతన ఆవిష్కరణలకు కృషి చేస్తున్నాయి. ప్రైవేటు రంగంలోనూ పలు అంతర్జాతీయ కంపెనీలు ఆర్అండ్డీలను ఏర్పాటు చేస్తున్నాయి.
జ. ఆహార ఉత్పత్తుల ఎగుమతులకు ఏపీఈడీఏ సహకారంతో ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపడుతున్నది. ట్రేడ్ షోలలో పాల్గొని వివిధ అంతర్జాతీయ కంపెనీలతో భాగస్వామ్యం ఏర్పర్చుకుంటున్నది. 2017లో ఢిల్లీలో నిర్వహించిన వరల్డ్ ఫుడ్ ఇండియా సదస్సులో రాష్ట్ర ప్రభుత్వంతో 11కంపెనీలు ఎంవోయూలు కుదుర్చుకున్నాయి. ఈ ఏడాది హైదరాబాద్‌లో నిర్వహించిన ప్రపంచ ఆహార సదస్సులో వందకుపైగా కంపెనీలు పాల్గొన్నాయి. ఆయా కంపెనీలు రూ.10,000 కోట్ల వరకు పెట్టుబడులు పెట్టాయి. రవాణా సౌకర్యం కల్పించడమే కాకుండా కోల్డ్ స్టోరేజ్, వేర్‌హౌసింగ్ సౌకర్యాలు కూడా కల్పిస్తున్నది.
జ. రాష్ట్ర ప్రభుత్వం సమగ్ర ఆహారశుద్ధి విధానాన్ని ప్రవేశపెట్టి అనేక ప్రోత్సాహకాలను అందిస్తున్నది. కోకాకోలా, హెరిటేజ్, ఎంటీఆర్, ఐటీసీ, కేఆర్‌బీఎల్ ఫుడ్స్ తదితర దిగ్గజ కంపెనీలు ఇక్కడ కొలువుదీరాయి. దేశీయ స్వీట్లు, చాక్లెట్లు, బిస్కెట్ల ఉత్పత్తిలో తెలంగాణ 60 శాతం వాటా కలిగి ఉంది. విదేశాలకు ఎగుమతి అవుతున్న వాటిలో 50శాతం వరకు మన రాష్ట్రం నుంచే ఉంటున్నాయి. ఖమ్మం, నిజామాబాద్ జిల్లాల్లో ప్రత్యేక ఫుడ్ ప్రాసెసింగ్ పార్క్‌లు ఏర్పాటయ్యాయి. మెదక్‌లో ఆగ్రో ప్రాసెసింగ్ క్లస్టర్‌ను ప్రభుత్వం నెలకొల్పింది. 11 సమీకృత కోల్డ్ చైన్ ప్రాజక్టులను ఏర్పాటు చేసింది.
జ. ప్రభుత్వం జిల్లాల వారీగా ప్రత్యేక ఆహార శుద్ధి మండళ్లను ఏర్పాటు చేస్తున్నది. పెట్టుబడిదారుల నుంచి మంచి స్పందన వస్తున్నది. తెలంగాణ ఆహారశుద్ధిలో అగ్రగామిగా ఎదిగేందుకు ఈ ఆహారశుద్ధి మండళ్లు దోహదపడతాయి. ప్రభుత్వ విధానాలు, ప్రోత్సాహకాల వల్ల అమూల్, హెచ్‌సీసీబీ, ది ఫిషింగ్ కో, హాట్సన్, ఉమెనోవా, మ్యాన్‌కైండ్, మార్స్ పెట్ ఫుడ్, మొనిన్, ప్లాంట్ లిపిడ్స్, ఇండిజీన్ ప్రొటీన్ ఫుడ్స్ తదితర ప్రఖ్యాతిగాంచిన కంపెనీలు భారీగా పెట్టుబడులు పెడుతున్నాయి.
-కిశోర్ శుక్లా