హైదరాబాద్, ఆగస్టు 6 (నమస్తే తెలంగాణ): ‘మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ పథకాలకు మీరు సిఫార్సు చేసినా కేంద్ర ప్రభుత్వం ఒక పైసా అయినా ఇచ్చిందా? సూటిగా, స్పష్టంగా సమాధానం ఇవ్వాలి’ అని నీతి ఆయోగ్‌ను రాష్ట్ర ప్రణాళిక సంఘం వైస్ చైర్మన్ బోయినపల్లి వినోద్‌కుమార్ డిమాండ్‌చేశారు. ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు శనివారం నీతిఆయోగ్ పై సంధించిన ప్రశ్నలకు సూటిగా జవాబివ్వాలన్నారు. మిషన్ భగీరథకు రూ. 19,205 కోట్లు, మిషన్ కాకతీయకు రూ. 5,000 ( ఐదు వేల కోట్లు ) వేల కోట్లు కలిపి మొత్తం 24,205 వేల కోట్ల రూపాయలు మంజూరు చేయాలని నీతి ఆయోగ్ కేంద్ర ప్రభుత్వానికి దాదాపు ఐదేండ్ల క్రితం సిఫార్సు చేసిందని, దీనిపై కేంద్ర ప్రభుత్వం ఒక పైసా కూడా రాష్ట్రానికి విడుదల చేయనిది వాస్తవం కాదా..? అని ప్రశ్నించారు. సీఎం కేసీఆర్ లేవనెత్తిన అంశంలో తప్పు ఎకడ ఉన్నదని నిలదీశారు.