హైదరాబాద్, మే 12 (నమస్తే తెలంగాణ) : రాష్ట్రంలోని రైతులందరికీ పూర్తిస్థాయిలో రుణమాఫీ అమలుచేయాలని సీపీఐ జాతీయ కార్యవర్గ సభ్యుడు చాడ వెంకట్రెడ్డి ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు సోమవారం పార్టీ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు ఈటీ నరసింహతో కలిసి సచివాలయంలో వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్రావుకు వినతిపత్రం అందజేశారు.
రూ.2లక్షల రుణమాఫీ అమలులో ప్రభుత్వ షరుతలతో దాదాపు 40శాతం మంది రైతులకు రుణమాఫీ కాలేదని మం త్రికి తెలిపారు. కరీంనగర్ జిల్లా చిగురుమామిడి మండలంలో రుణమాఫీకి అర్హులైనవారు 9,588 ఉండగా, వారిలో 5,864 మందికి మాత్రమే రుణమాఫీ అయినట్టు తెలిపారు.