హైదరాబాద్, జూన్ 16 (నమస్తే తెలంగాణ): గ్రూప్4 పోస్టుల భర్తీకి ఈ నెల 20 నుంచి ఆగస్టు 21 వరకు సర్టిఫికెట్ వెరిఫికేషన్ ప్రక్రియ నిర్వహించనున్నట్టు టీజీపీఎస్సీ సెక్రటరీ నవీన్ నికోలస్ తెలిపారు.
తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్, పొట్టిశ్రీరాములు తెలుగు యూనివర్సిటీలో సర్టిఫికెట్ వెరిఫికేషన్ ఉంటుందని వెల్లడించారు. రిజర్వు రోజుల కింద ఆగస్టు 24, 27, 31 తేదీలు నిర్ణయించినట్టు పేర్కొన్నారు. వివరాలకు టీజీపీఎస్సీ వెబ్సైట్ను సంప్రదించాలని సూచించారు.