హైదరాబాద్, మే 4 (నమస్తే తెలంగాణ): ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్ఐఆర్) ప్రక్రియలో భాగంగా రాష్ట్రంలో ఓటర్ల మ్యాపింగ్‌ను వేగవంతం చేయాలని అదనపు ప్రధాన ఎన్నికల అధికారి డాక్టర్ వాసం వెంకటేశ్వర్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. ఓటర్ల మ్యాపింగ్ 50% కంటే తకువగా ఉన్న హైదరాబాద్, రంగారెడ్డి, సంగారెడ్డి, మేడ్చల్, నిజామాబాద్, ఖమ్మం జిల్లాల్లోని 28 అసెంబ్లీ నియోజకవర్గాల ఈఆర్వోలు, ఏఈఆర్వోలతో సోమవారం ఆయన హైదరాబాద్‌లోని ఈసీవో కార్యాలయం నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షిం చారు.
ఓటర్ల మ్యాపింగ్, ఒకే పోలికలున్న ఓటర్ల తొలగింపు, పెండింగ్‌లో ఉన్న ఫారం 6, 6ఏ, 7, 8 దరఖాస్తుల పరిషారంపై అధికారులకు కీలక ఆదేశాలు జారీచేశారు. 2025 జాబితాలోని అర్హులైన ఓటర్లందరినీ 2002 ఓటర్ల జాబితాతో మ్యాపింగ్ చేయాలని ఆదేశించారు. బూత్ లెవల్ అధికారులు ఇంటింటికీ వెళ్లి ఓటర్ల వివరాలను సేకరించి, మ్యాపింగ్ ప్రక్రియను త్వరితగతిన పూర్తి చేయాలని సూచించారు.