హైదరాబాద్, జూన్ 12 (నమస్తే తెలంగాణ) : రాష్ట్రంలోని టాప్ ఐదు వార్తాపత్రికలు, ఆన్లైన్ న్యూస్ పోర్టల్స్, టీవీ చానళ్లు, ఇన్ప్లూయెన్సర్లతో హైదరాబాద్‌లోని బీఆర్కే భవన్లో ఈనెల 17న సమావేశం నిర్వహించనున్నట్టు రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి (సీఈవో) సీ సుదర్శన్‌రెడ్డి తెలిపారు.
ఎన్నికల కమిషన్ ఆఫ్ ఇండియా (ఈసీఐ) మార్గదర్శకాలు, సూచనలను విస్తృతంగా ప్రచారం చేయడం కోసం మంగళవారం సాయంత్రం 4గంటలకు సమావేశాన్ని ఏర్పాటు చేయబోతున్నట్టు గురువారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా ఎడిటర్లు, తెలంగాణ సోషల్ మీడియా ఇన్ఫ్లూయెన్సర్లు హాజరుకావాలని ఆయన విజ్ఞప్తిచేశారు.