హైదరాబాద్, ఫిబ్రవరి 1 (నమస్తే తెలంగాణ) : ఉన్నత విద్యలో ప్రవేశిస్తున్న మహిళలకు కేంద్రం శుభవార్త చెప్పింది. మహిళల కోసం ప్రత్యేకంగా జిల్లాకో హాస్టల్ చొప్పున నిర్మిస్తామని కేంద్రం తాజాగా బడ్జెట్లో వెల్లడించింది. ఈ లెక్కన రాష్ర్టానికి 33 కొత్త హాస్టళ్లు మంజూరుకానున్నాయి.
ఈ మధ్యకాలంలో తెలంగాణలో ఉన్నత విద్యలో నమోదు(గ్రాస్ ఎన్రోల్మెంట్ రేషియో) పెరుగుతున్నది. ముఖ్యంగా సైన్స్, టెక్నాలజీ ఇంజినీరింగ్ అండ్ గణితం(స్టెమ్) కోర్సుల్లో ప్రవేశాలు పొందుతున్నారు. 2021-22 సంవత్సరంలో జీఈఆర్ 40శాతానికి చేరింది. మహిళ నమోదు 41.6శాతంగా ఉంది. అంటే పురుషులతో పోల్చితే మహిళల నమోదు ఏటా పెరుగుతున్నది.