Home
Telangana
Centre Announces Awards To 140 Police Officials Five Each From Ap Telangana To Receive Medals
ఐదుగురికి హోం మినిస్టర్ మెడల్స్
ఉత్తమ విచారణ విభాగంలో ఈ ఏడా ది కేంద్ర హోంమంత్రి మెడల్‌కు తెలంగాణ నుంచి ఐదుగురు పోలీసు ఉన్నతాధికారులు ఎంపికయ్యారు. ‘యూనియన్ హోంమినిస్టర్ మెడల్ ఫర్ ఎక్స్‌లెన్స్ ఇన్ ఇన్వెస్టిగేషన్' కు దేశవ్యాప్తంగా 140 మంది అధికారులు ఎంపికయ్యారు. నేర పరిశోధనలో ఉన్నతమైన వృత్తి ప్రమాణాలను పాటిస్తూ.. దర్యాప్తును వేగవంతంగా పూర్తిచేసినందుకుగాను ఈ విభాగంలో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షా నుంచి మెడల్‌ను స్వీకరించనున్నారు.
- ఉత్తమ విచారణ విభాగంలో తెలంగాణ నుంచి ఎంపిక
- దేశవ్యాప్తంగా 140 మంది
- మెడల్స్ ప్రదానం చేయనున్న కేంద్ర హోంమంత్రి అమిత్ షా
హైదరాబాద్, ఆగస్టు 12 (నమస్తే తెలంగాణ): ఉత్తమ విచారణ విభాగంలో ఈ ఏడా ది కేంద్ర హోంమంత్రి మెడల్‌కు తెలంగాణ నుంచి ఐదుగురు పోలీసు ఉన్నతాధికారులు ఎంపికయ్యారు. ‘యూనియన్ హోంమినిస్టర్ మెడల్ ఫర్ ఎక్స్‌లెన్స్ ఇన్ ఇన్వెస్టిగేషన్’ కు దేశవ్యాప్తంగా 140 మంది అధికారులు ఎంపికయ్యారు. నేర పరిశోధనలో ఉన్నతమైన వృత్తి ప్రమాణాలను పాటిస్తూ.. దర్యాప్తును వేగవంతంగా పూర్తిచేసినందుకుగాను ఈ విభాగంలో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షా నుంచి మెడల్‌ను స్వీకరించనున్నారు. ఈ మెడల్ అందుకొనేవారిలో తెలుగు రాష్ర్టాల నుంచి పది మంది ఉన్నారు. సీబీఐ నుంచి 15 మంది, ఎన్ఐఏ నుంచి 12 మంది, ఉత్తరప్రదేశ్ నుంచి 10 మంది, కేరళ 9 మంది, రాజస్థాన్ 9 మంది, ఇతర రాష్ర్టాల నుంచి 140 మంది అధికారులున్నారు. వీరిలో 22 మంది మహిళా పోలీసు అధికారులున్నారు.
తెలంగాణ నుంచి ఎంపికైంది వీరే..
- మేకల తిరుపతన్న: హైదరాబాద్‌లో ఇంటెలిజెన్స్ అడిషనల్ ఎస్పీగా విధులు నిర్వర్తిస్తున్నారు. 2016 నవంబర్‌లో జరిగిన ఓ మర్డర్ కేసును ఛేదించి, త్వరగా బాధితులకు న్యాయం జరిగేలా చూశారు.
- మూల జితేందర్‌రెడ్డి: ప్రస్తుతం వరంగల్ టాస్క్‌ఫోర్స్ ఏసీపీగా విధులు నిర్వర్తిస్తున్నారు. 2020 జనవరిలో ఓ యువతిపై లైంగికదాడి, దారుణ హత్య కేసును చాకచక్యంగా ఛేదించారు. నేరస్తుడికి జైలు శిక్ష పడేలా చేశారు.
- కేఎం కిరణ్‌కుమార్: ఈయన ప్రస్తుతం బోధన్ ఏసీపీగా విధులు నిర్వర్తిస్తున్నారు. 2017 నవంబర్‌లో ఆరేండ్ల చిన్నారిపై జరిగిన లైంగికదాడి కేసును ఛేదించి, నేరస్తుడికి కఠిన శిక్షపడేలా విచారణ చేపట్టారు.
- రాజుల సత్యనారాయణరాజు: ప్రస్తుతం ఇంటెలిజెన్స్ డీఎస్పీగా విధులు నిర్వర్తిస్తున్నారు. 2020లో ఓ బాలికపై లైంగికదాడి ఘటనలో ఆధారాలు సేకరించి, ముగ్గురు నేరస్థులకు యావజ్జీవ కారాగార శిక్షపడేలా విచారణ చేపట్టారు.
- భూపతి శ్రీనివాసరావు: ప్రస్తుతం ఏసీపీగా విధులు నిర్వర్తిస్తున్న శ్రీనివాసరావు కూడాఈ మెడల్‌కు ఎంపికయ్యారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Bathukamma | పండుగ పూట కరెంట్ కోతలు.. చీకట్లోనే బతుకమ్మ ఆడిన మహిళలు
Tiger Shroff | బాలీవుడ్ నటుడు టైగర్ ష్రాఫ్‌పై కాల్పులు.. సల్మాన్ ఖాన్‌తో పనిచేసే వారే టార్గెట్?
Lal Hit Janata Party | సీజేపీకి వ్యతిరేకంగా.. ‘లాల్ హిట్ జనతా పార్టీ’ ఏర్పాటు
Horse Riding | పిల్లల్లో హైపర్యాక్టివిటీ తగ్గించడంలో గుర్రపు స్వారీ ఎంతో మేలు.. అధ్యయనంలో వెల్లడి..
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

