హైదరాబాద్, ఫిబ్రవరి21 (నమస్తే తెలంగాణ): కేంద్ర జలసంఘం (సీడబ్ల్యూసీ) చైర్మన్ ముఖేశ్‌కుమార్ సిన్హాను గోదావరి రివర్ మేనేజ్మెంట్ బోర్డు (జీఆర్ఎంబీ) ఇంజినీర్లు, సాగునీటిపారుదల శాఖ ఇంజినీర్లు ఘనంగా సన్మానించారు. మొన్నటి వరకు జీఆర్ఎంబీ చైర్మన్‌గా పనిచేసిన ముఖేశ్కుమార్కు సీడబ్ల్యూసీ చైర్మన్‌గా పదోన్నతి లభించిన విషయం తెలిసిందే.
ఈ నేపథ్యంలో శుక్రవారం జీఆర్ఎంబీ చైర్మన్ ఏకే ప్రధాన్, బోర్డు మెంబర్ సెక్రటరీ అజగేషన్, బోర్డు ఇంజినీర్లు ప్రసాద్, శ్రీనివాస్, సురేశ్ తదితరులు ముఖేశ్‌కుమార్‌ను శాలువాతో సత్కరించారు. అలాగే సాగునీటిపారుదల శాఖ ఈఎన్సీ అనిల్‌కుమార్, డిప్యూటీ ఈఎన్సీ శ్రీనివాస్, విజయ్‌భాస్కర్, అజ్మల్‌ఖాన్, సుబ్రహ్మణ్యప్రసాద్, నానక్‌రాం, ఆకేళ్ల సురేశ్ తదితరులు ముఖేశ్‌కుమార్‌ను కలిసి సన్మానించారు.