నాగార్జునసాగర్ : నాగార్జునసాగర్ డ్యాం(Nagarjunasagar) విజయపురి సౌత్‌లో గురువారం విమానాశ్రయ నిర్మాణం(Airport) కోసం విమాన సర్వీసుల కేంద్ర బృందం సందర్శించి స్థల పరిశీలన చేశారు. దీని కోసం బుధవారం రాత్రి నాగార్జునసాగర్ లోని విజయ విహార్‌కు ఈ బృందం చేరుకుంది. వీరికి స్థాని ప్రొటోకాల్ ఆర్ఐ దండా శ్రీనివాస్ రెడ్డి స్వాగతం పలికారు. గురువారం ఈ బృందం ఆంధ్ర ప్రాంతం విజయపురి సౌత్‌లోని పాత ఎయిర్ పోర్టు, చుట్టుపక్కల ప్రదేశాలను విమానాశ్రయ నిర్మాణానికి అనుకూలంగా ఉంటుందా లేదా అని స్థల పరిశీల చేశారు.
సుమారు 1600 ఎకరాలలో నూతనంగా విమానాశ్రయాన్ని నిర్మించడానికి ఆంధ్ర ప్రాంతంలో పలు ప్రాంతాలను ఇప్పటికే పరిశీలించారు. ఆంధ్ర ప్రాంతం నాగార్జునసాగర్ పరిధిలోని 16 ఎకరాలలో విమానాశ్రయం నిర్మాణం అయితే తెలంగాణ ప్రాంతంలోని పర్యాటక కేంద్రాలు కూడా అభివృద్ధి చెందే అవకాశం ఉంది. ఢిల్లీ నుంచి వచ్చిన కేంద్ర బృందంలో ఏఎస్ఎన్ మూర్తి, ప్రవీంద్ర తివారి, అరుణ్ కుమార్, అమాన్ చిప్ప, సాజీజ్ అభిలాజ్, ఉస్మాన్ ఉన్నారు. వీరితోపాటు గురజాల ఆర్డీవో మురళీకృష్ణ, మాచర్ల తాసిల్దార్ కిరణ్ కుమార్, రెవెన్యూ ఇన్స్పెక్టర్ అనిల్ కుమార్, ఇరిగేషన్ అగ్రికల్చర్ అధికారుల తదితరులు ఉన్నారు.