శివబాలకృష్ణ కేసులోకి ఈడీ, ఐటీ?
హెచ్ఎండీఏ మాజీ డైరెక్టర్ శివబాలకృష్ణ అక్రమాస్తుల కేసుపై కేంద్ర దర్యాప్తు సంస్థలు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ), ఆదాయపు పన్ను (ఐటీ) శాఖలు దృష్టి పెట్టాయి.
- వివరాలు కోరిన దర్యాప్తు సంస్థలు
- శివబాలకృష్ణ చిట్టాలో ఐఏఎస్‌లు?
- సోమేశ్ ఆస్తిపత్రాలు స్వాధీనం
హైదరాబాద్, ఫిబ్రవరి 8 (నమస్తే తెలంగాణ)/మణికొండ/నాంపల్లి కోర్టులు: హెచ్ఎండీఏ మాజీ డైరెక్టర్ శివబాలకృష్ణ అక్రమాస్తుల కేసుపై కేంద్ర దర్యాప్తు సంస్థలు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ), ఆదాయపు పన్ను (ఐటీ) శాఖలు దృష్టి పెట్టాయి. ఈ కేసును మొదటి నుంచి ఫాలో అవుతున్న ఈ సంస్థలు విచారణ అనంతరం తుది నివేదికను తమకు ఇవ్వాలని ఏసీబీ ఉన్నతాధికారులను కోరినట్టు విశ్వసనీయ సమాచారం. శివబాలకృష్ణ అక్రమాస్తుల చిట్టాలో పలువురు ఐఏఎస్ అధికారుల పాత్ర ఉన్నట్టు తెలుస్తున్నది. కొందరు ఐఏఎస్ అధికారులకు బాలకృష్ణ లబ్ధి చేకూర్చినట్టుగా ఏబీసీ విచారణలో గుర్తించింది. ఆ ఐఏఎస్ అధికారుల ఆస్తి పత్రాలు ఏసీబీ స్వాధీనం చేసుకున్నట్టు తెలిసింది. ప్రధానంగా మాజీ సీఎస్ సోమేశ్‌కుమార్‌కు చెందిన ఆస్తి పత్రాలు సైతం ఉన్నట్టు ఏసీబీ అధికారులు తెలిపారు.
బినామీ పేర్లపైనే 70 శాతానికిపైగా ఆస్తులు
భారీ మొత్తంలో బినామీ పేర్లపై ఆస్తులను కూడబెట్టిన శివబాలకృష్ణ.. తన తమ్ముడు నవీన్‌కుమార్, మరదలు, మేనల్లుడు భరత్ పేర్లపై భారీగా ఆస్తులు రాసిపెట్టాడు. 70 శాతానికిపైగా ఆస్తులు బినామీ పేర్లపైనే ఉన్నట్టు ఏసీబీ అధికారులు గుర్తించారు. ఈ క్రమంలో ఇప్పటికే నవీన్‌కుమార్‌ను ఏసీబీ అరెస్టు చేసింది. ఈ కేసులో మరో ముగ్గురి అరెస్టుకు రంగం సిద్ధం చేసినట్టు సమాచారం. యాదాద్రిలో 66 ఎకరాలు, సిద్దిపేటలో 10 ఎకరాలు, జనగామలో 102 ఎకరాలు, నాగర్‌కర్నూల్‌లో 30 ఎకరాలు, కొడకండ్లలో 48, రఘునాథపల్లిలో 28, జఫర్‌గఢ్‌లో 50 ఎకరాలకు సంబంధించిన భూపత్రాలు స్వాధీనం చేసుకున్నారు. అనుమతుల పేరుతో మనీలాండరింగ్ జరిగినట్టు ఈడీ అనుమానిస్తున్నది. ఇటు కోట్ల రూపాయల అక్రమాస్తులకు సంబంధించి ఐటీ సంస్థ కూడా నజర్ పెట్టింది.
నిర్మాణ రంగ సంస్థల లావాదేవీలపై ఏసీబీ విచారణ
శివబాలకృష్ణకు లబ్ధి చేకూర్చిన అనుయాయులపై ఏసీబీ అధికారులు లోతైన విచారణ చేపట్టారు. గురువారం మణికొండ, నార్సింగి మున్సిపాలిటీల పరిధిలోని పలు నిర్మాణరంగ సంస్థల వివరాలపై విచారణ జరిపినట్టు విశ్వసనీయ సమాచారం. శివబాలకృష్ణ అక్రమాస్తులు సంపాదించడంతో ప్రధాన పాత్ర పోషించిన పలు నిర్మాణ రంగ సంస్థల బ్యాంకు లావాదేవీలపై సమగ్ర విచారణ మొదలైనట్టు తెలియడంతో బిల్డర్లలో వణుకు మొదలైంది. పుప్పాలగూడలోని ఆదిత్యా ఫోర్ట్ విల్లాల్లో నివాసముంటున్న శివబాలకృష్ణ అక్రమాస్తుల్లో సగభాగం మణికొండ, నార్సింగి ప్రాంతాల్లో ఆరు నిర్మాణరంగ సంస్థలల్లోనే పెట్టుబడులు పెట్టినట్టు తెలిసింది. ప్రధానంగా ఈఐపీఎల్, ఇన్ఫ్రా, ఐరా, అనుహర్ వంటి సంస్థల్లో అతడు పెట్టుబడులు పెట్టినట్టు సమాచారం.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Exercise | పీసీఓఎస్ వంటి సమస్యలు ఉన్న మహిళలు చేయాల్సిన వ్యాయామాలు ఇవే..
Boyfriend Falls From Balcony | నాలుగో అంతస్తు నుంచి కిందపడి వ్యక్తి మృతి.. ఇన్ఫ్లుయెన్సర్ అయిన ప్రియురాలిపై అతడి తల్లి ఫిర్యాదు
Vaccine | శీతాకాలంలో వీరికి శ్వాసకోశ సమస్యల ముప్పు ఎక్కువ.. టీకా తీసుకోవాలంటున్న వైద్యులు..
Nuclear War | మానవాళికి ఏఐ, న్యూక్లియర్ ముప్పు.. 2100లోపు మానవాళి అంతం తప్పదా
New Districts | కొత్త జిల్లాల ఏర్పాటు చారిత్రాత్మక ఘట్టం.. కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

