హైదరాబాద్ : వరి ధాన్యం కొనుగోలు చేసేదాక మోదీ ప్రభుత్వాన్ని వదిలేదని లేదని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి పేర్కొన్నారు. సీఎం కేసీఆర్ పిలుపు మేరకు.. వరి ధాన్యం కొనుగోలు చేయాలంటూ మహేశ్వరంలో ఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించిన నిరసన దీక్షలో కార్యక్రమంలో మంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా సబిత మాట్లాడుతూ కేంద్రం వైఖరి తెలిసే వరి సాగు చేయొద్దని సీఎం కేసీఆర్ ముందే రైతులకు సూచించారన్నారు. వరి వేయాలని బీజేపీ నేతలు రైతులను రెచ్చగొట్టారన్నారు. వరి కొనిపిస్తామన్న బీజేపీ నేతలు ఇప్పుడు కనిపించడం లేదని విమర్శించారు. ధాన్యం కొనుగోలు చేసేంత వరకు విడిచిపెట్టలేదన్నారు. నిరసన కార్యక్రమంలో పెద్ద ఎత్తున టీఆర్ఎస్ శ్రేణులు పాల్గొన్నాయి. కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినదించాయి. యాసంగి ధాన్యాన్ని నేరుగా కేంద్రమే కొనుగోలు చేయాలని ముక్తకంఠంతో నినదించాయి. కార్యక్రమంలో మహేశ్వరం మాజీ ఎమ్మెల్యే తీగల కృష్ణారెడ్డితో పాటు ప్రజాప్రతినిధులు, టీఆర్ఎస్ నేతలు పాల్గొన్నారు.