హైదరాబాద్, ఆగస్టు 6 (నమస్తే తెలంగాణ): ఎన్నికల వ్యయ పర్యవేక్షణ కోసం కేంద్ర ఎన్నికల సంఘం పటిష్ఠమైన వ్యవస్థను అమలు చేస్తున్నదని కేంద్ర ఎన్నికల సంఘం ప్రధానాధికారి వికాస్‌రాజ్ అన్నారు. జిల్లా ఎన్నికల అధికారులకు ఏర్పాటుచేసిన రెండు రోజుల శిక్షణ కార్యక్రమం శనివారంతో ముగిసింది.
బీఆర్కేఆర్ భవన్లో నిర్వహించిన ముగింపు కార్యక్రమంలో వికాస్‌రాజ్ మాట్లాడుతూ.. ఎన్నికల ఖర్చు సంబంధ ఖాతాలపై దృష్టి పెడుతామన్నారు. సాంకేతిక మేధస్సును ఉపయోగించి వ్యయ ఉల్లంఘనలను అధికారులు సమర్థంగా పర్యవేక్షించాల్సి ఉంటుందని సూచించారు.