సూర్యాపేట : తెలంగాణ రైతులపై కేంద్రం కక్ష్య కట్టిందని మంత్రి జగదీష్ రెడ్డి అన్నారు. యాసంగి వడ్లను కేంద్రం కొనుగోలు చేయాలనే డిమాండ్‌తో సూర్యపేటలో టీఆర్ఎస్ పార్టీ చేపట్టిన రైతు ధర్నాలో మంత్రి పాల్గొని మాట్లాడారు. సీఎం కేసీఆర్ రైతుల జేబులు నింపుతుంటే ప్రధాని మోదీ కొల్లగొడుతున్నారని మండిపడ్డారు. రైతుల ధాన్యం కొనుగోలు చేస్తామని బీజేపీ పాలిత కేంద్రం ప్రకటించేంత వరకు పోరాటం కొసాగిస్తామన్నారు.
బీజేపీ రాష్ట్ర నాయకులకు నిజంగా రైతుల పట్ల ప్రేమ ఉంటే డ్రామాలు ఆపి బియ్యం కొంటామని కేంద్రంతో ఒక్క ప్రకటన చేపిస్తే చాలు ఆందోళనలను విరమించుకుంటామన్నారు.