కాళేశ్వరం ప్రాజెక్టు తెలంగాణ బీళ్లను తడిపే ‘సుజలేశ్వర’మని.. లక్షలాది ఎకరాల ఆయకట్టును సాగులోకి తెచ్చిన ‘సుఫలేశ్వర’మని.. ప్రతి పైసా వినియోగంలో పారదర్శకత పాటించిన ‘స్వచ్ఛమైన’ ప్రాజెక్టని..రుణాల చెల్లింపు సక్రమంగా సాగుతున్నదని.. స్వయంగా కేంద్రం సంతకం చేసింది.
ప్రాజెక్టుపై అడ్డగోలు ఆరోపణలు చేస్తున్నవారికి ఇది చెంపపెట్టు.. ప్రాజెక్టు నిర్మాణం, నిర్వహణపై అపోహలకు తిరుగులేని జవాబు..రుణాలను తెలంగాణ చెల్లించగలదా? అన్న అనుమానాలకు చరమగీతం..
హైదరాబాద్, జనవరి 22 (నమస్తే తెలంగాణ): కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం, నిర్వహణ సక్రమంగా సాగుతున్నాయని స్వయంగా కేంద్ర ప్రభుత్వం గుర్తింపు ఇచ్చింది. కేంద్ర విద్యుత్తుశాఖ పరిధిలోని ‘రూరల్ ఎలక్ట్రిఫికేషన్ కార్పొరేషన్ లిమిటెడ్’ (ఆర్ఈసీ) ‘కాళేశ్వరం ఇరిగేషన్ ప్రాజెక్టు లిమిటెడ్’కు ‘ఏ క్యాటగిరీ’ గ్రేడ్ ఇచ్చింది. ఆర్ఈసీ దేశవ్యాప్తంగా ప్రాజెక్టుల పనితీరు, నిర్వహణ తదితర అంశాలను పరిగణనలోకి తీసుకొని గ్రేడింగ్ ఇస్తుంటుంది. ఈ క్రమంలో ఒక ప్రాజెక్టు నిర్మాణం కోసం సేకరించిన నిధులను వినియోగించిన తీరు, వాటితో ఏమైనా ఫలితాలు వచ్చాయా? రుణ వాయిదాలను సక్రమంగా కడుతున్నారా? గడువులోగా వాయిదాలు చెల్లిస్తున్నారా? ఆయా ప్రాజెక్టుల నిర్వహణపై ఆడిటింగ్ నిర్వహిస్తున్నారా? వంటి అంశాలను లోతుగా అధ్యయనంచేసి గ్రేడింగ్ ఇస్తుంది. కాళేశ్వరం నిర్మాణం, నిర్వహణ కోసం రాష్ట్ర ప్రభుత్వం ఏ ర్పాటుచేసిన ‘కాళేశ్వరం ఇరిగేషన్ ప్రాజెక్టు లిమిటెడ్’ ను ఆర్ఈసీ ‘ఏ క్యాటగిరీ’లో చేర్చింది. ఈఆర్సీ ద్వా రా ఏ గ్రేడ్ సాధించిన దేశంలని పెద్ద ఇరిగేషన్ ప్రాజెక్టుగా, ఈ క్యాటగిరీలో స్థానం సాధించిన అతిపెద్ద ప్రాజెక్టుగా కాళేశ్వరం రికార్డు సృష్టించింది.
పారదర్శకం.. ఫలితం
కాళేశ్వరం ఇరిగేషన్ ప్రాజెక్టు లిమిటెడ్‌కు ఏ గ్రేడ్ ఇవ్వడం ద్వారా.. కాళేశ్వరం నిధులన్నీ పారదర్శకంగా ఖర్చయ్యాయని, ఆ నిధులతో చేసిన పనుల వల్ల ఫలి తం కూడా వచ్చిందని, రుణ వాయిదాలను సక్రమంగా చెల్లిస్తున్నారని స్వయంగా కేంద్రం సర్టిఫికెట్ ఇచ్చినట్టేనని నిపుణులు చెప్తున్నారు. వాస్తవానికి రాష్ట్ర ప్రభు త్వం ఈ విషయాన్ని ముందునుంచీ చెప్తున్నది. ప్రాజె క్టు కోసం సేకరించిన ప్రతి రూపాయిని సద్వినియోగం చేశామని, ఫలితంగా లక్షల ఎకరాలకు సాగునీరు అం దుతున్నదని, భూగర్భంలో జల భాండాగారం తయారైందని, అన్నదాతలకు సిరుల పంట పండుతున్నదని ప్రభుత్వం చెప్తున్నది. అయినా ప్రతిపక్షాలు అడ్డగోలు విమర్శలు చేస్తున్నాయి. ఇప్పుడు ఆర్ఈసీ గుర్తింపుతో విమర్శలన్నింటికీ చెక్ పడ్డట్టేనని నిపుణులు అన్నారు.
పెరిగిన పరపతి
ఆర్ఈసీ గుర్తింపుతో జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో తెలంగాణ పరపతి మరింత పెరిగింది. రుణాలు తీసుకోవడమే కాదు.. వాటిని సద్వినియోగం చేస్తూ, తిరిగి సకాలంలో చెల్లించగల సత్తా తెలంగాణకు ఉన్నదంటూ ఆర్ఈసీ ఒక సర్టిఫికెట్ ఇచ్చినట్టేనని నిపుణులు చెప్తున్నారు. దీంతో తెలంగాణ ఆర్థిక పరిస్థితిపై అనుమానాలన్నీ తొలుగుతాయని పేర్కొన్నారు. అంతేకాకుండా భవిష్యత్తులో ప్రాజెక్టుల కోసం చేపట్టే రుణ సమీకరణ సులభం అవుతుందని అంటున్నారు. పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల వంటి పథకాల కోసం రుణ సమీకరణ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తున్నది. ఇలాంటి సమయంలో ఈఆర్సీ గుర్తింపు కొత్త ఉత్సాహాన్ని ఇస్తుందని, కొత్త అవకాశాలను సృష్టిస్తుందని నిపుణులు వివరించారు.
ఏమిటీ కాళేశ్వరం లిమిటెడ్
కాళేశ్వరం ఇరిగేషన్ ప్రాజెక్టు లిటటెడ్ అనేది రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన స్పెషల్ పర్పస్ వెహికిల్. ఇది 2016లో మొదలైంది. కాళేశ్వరం ప్రాజెక్టు అభివృద్ధి, నిధుల సమీకరణ, నిర్వహణను పర్యవేక్షణకు ప్రభుత్వం దీనిని ఏర్పాటుచేసింది. దీనికి నీటిపారుదలశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రజత్‌కుమార్ చైర్మన్. ఈఎన్సీ హరిరామ్ ఎండీ. ఈఎన్సీలు మురళీధర్, వెం కటేశ్వర్లు, డిప్యూటీ సెక్రటరీ ఎల్ఎల్వీ సుబ్బమ్మ, చీఫ్ ఇంజినీర్ వీ రమేశ్ (మహబూబ్‌నగర్) టీఎస్ ట్రా న్స్‌కో డైరెక్టర్ జే సూర్యప్రకాశ్, ఆర్థికశాఖ అదనపు కార్యదర్శి ఆర్ రవి సభ్యులు. ఈ కార్పొరేషన్ కాళేశ్వరం ప్రాజెక్టు డిజైనింగ్ మొదలు నిర్మాణం, నిధులు, రుణాల సేకరణ, కాళేశ్వరం ప్రాజెక్టును ప్రారంభించిన తర్వాత ఫలితాలను ప్రజలకు అందించడం వరకు కీలక బాధ్యతలు నిర్వర్తిస్తున్నది. 2019లో కాళేశ్వరం కార్పొరేషన్‌కు అదనంగా పాలమూరు రంగారెడ్డి ప్రాజె క్టు నిర్వహణ బాధ్యతలను కూడా అప్పగించారు.
కాళేశ్వరం విశేషాలు…
తెలంగాణకు గర్వకారణం
కాళేశ్వరం ప్రాజెక్టుకు ఈఆర్సీ ఏ క్యాటగిరీలో చేర్చడం తెలంగాణకు గర్వకారణం. జాతీయ స్థాయిలో మన రాష్ట్రం పరపతి మరింత పెరిగింది. ముఖ్యమంత్రి కేసీఆర్ విజన్, ఆయన మార్గనిర్దేశంలో ప్రాజెక్టు రికార్డు సమయంలో పూర్తికావడంతోపాటు లక్షల మంది రైతులకు భరోసా ఇచ్చింది. ఈ గుర్తింపుతో రాష్ట్రంలోని సాగునీటి ప్రాజెక్టులపై ఉన్న అపోహలన్నీ
తొలిగిపోతాయి.