నమస్తే తెలంగాణ నెట్వర్క్, ఆగస్టు 11: హుజూరాబాద్ టీఆర్ఎస్ అభ్యర్థిగా టీఆర్ఎస్వీ రాష్ట్ర అధ్యక్షుడు గెల్లు శ్రీనివాస్‌యాదవ్ ఎంపికపై రాష్ట్రవ్యాప్తంగా సంబురాలు మిన్నంటాయి. హైదరాబాద్‌లోని తెలంగాణ భవన్లో పశుసంవర్ధకశాఖ మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్, యువ నాయకుడు తలసాని సాయికిరణ్ అధ్వర్యంలో యాదవ సంఘాల ప్రతినిధులు, విద్యార్థి నాయకులు పటాకులు పేల్చి సంబురాలు జరుపుకొన్నారు. మరో విద్యార్థి నాయకుడికి అవకాశం కల్పించినందుకు సీఎం కేసీఆర్‌కు విద్యార్థి నేతలు కృతజ్ఞతలు తెలిపారు. టీఆర్ఎస్వీ ఆధ్వర్యంలో ఓయూ ఆర్ట్స్ కళాశాల ఆవరణలో విద్యార్థులు పటాకులు కాల్చి, స్వీట్లు పంచుకొన్నారు. తెలంగాణ ఉద్యమంలో మొదటి నుంచి క్రియాశీలకంగా పాల్గొన్న గెల్లుకు సీఎం కేసీఆర్ అవకాశం కల్పించడం గొప్పవిషయమని పేర్కొన్నారు. కేసీఆర్‌ను చూసి మిగిలిన పార్టీల నాయకులు నేర్చుకోవాలని హితవు పలికారు. నల్లగొండ, మిర్యాలగూడ, దేవరకొండ, హాలియా పట్టణాల్లో టీఆర్ఎస్ నాయకులు పటాకులు కాల్చి, స్వీట్లు పంచుకున్నారు. వరంగల్ అర్బన్ జిల్లా కమలాపూర్ బస్టాండ్‌లో గొల్లకురుమలతో కలిసి ఓయూ జేఏసీ నేత రాజారాంయాదవ్ సంబురాలు జరుపుకొన్నారు. వరంగల్ అర్బన్ జిల్లా కమలాపూర్‌లో పరాకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి ఆధ్వర్యంలో పది వేల మందితో భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు.
గెల్లు గెలుపునకు విద్యార్థి నేతల ప్రతిన
హైదరాబాద్, ఆగస్టు 11 (నమస్తే తెలంగాణ): హుజూరాబాద్ టీఆర్ఎస్ అభ్యర్థిగా గెల్లు శ్రీనివాస్‌యాదవ్‌ను ప్రకటించడంపై రాష్ట్రవ్యాప్తంగా విద్యార్థి నాయకులు హర్షం వ్యక్తంచేస్తున్నారు. రాజకీయాల్లో యువతను, విద్యార్థి నాయకులను ప్రోత్సహిస్తున్న టీఆర్ఎస్కు మద్దతుగా నిలవాలని పిలుపునిచ్చారు. గెల్లును అభ్యర్థిగా ప్రకటించి విద్యార్థులందరికీ సీఎం కేసీఆర్ భరోసా కల్పించారని ఓయూ విద్యార్థి నేత కే కిశోర్‌గౌడ్ పేర్కొన్నారు. ఉద్యమ విద్యార్థులకు దక్కి న మరో సువర్ణావకాశమని ఓయూ విద్యార్థి నేత చిరుమల్ల రాకేశ్ పేర్కొన్నారు. గెల్లు శ్రీనివాస్‌కు పోటీచేసే అవకాశాన్ని కల్పించిన సీఎం కేసీఆర్ మరోసారి చరిత్ర సృష్టించబోతున్నారని ఓయూ టీఆర్ఎస్వీ ప్రధాన కార్యదర్శి ఎర్రవాండ్ల కృష్ణ చెప్పారు. గెల్లును గెలిపించి సీఎం కేసీఆర్‌కు కానుకగా ఇస్తామని కేయూ విద్యార్థి నేత కే వాసుదేవరెడ్డి పేర్కొన్నారు. విద్యార్థులమంతా కలిసి గెల్లు శ్రీనివాస్‌ను గెలిపించుకుంటామని కేయూ జేఏసీ చైర్మన్ బొల్లికొండ వీరేందర్, కేయూ విద్యార్థి నేత జోరిక రమేశ్ పేర్కొన్నారు.
గౌడ సంఘాల మద్దతు
హైదరాబాద్, ఆగస్టు 11 (నమస్తే తెలంగాణ)/ హిమాయత్‌నగర్: హుజూరాబాద్ టీఆర్ఎస్ అభ్యర్థిగా బీసీ యువ నేత గెల్లు శ్రీనివాస్‌యాదవ్‌కు అవకాశం దకడంపై తెలంగాణ గౌడ సంఘం నాయకులు హర్షం వ్యక్తంచేశారు. గెల్లు శ్రీనివాస్యాదవ్కే గౌడ కులస్థుల సంపూర్ణ మద్దతు ఉంటుందని ప్రకటించారు. బుధవారం హిమాయత్‌నగర్‌లోని తెలంగాణ గౌడ సంఘం కార్యాలయంలో సంఘం వ్యవస్థాపక అధ్యక్షుడు పల్లె లక్ష్మణ్‌రావుగౌడ్ మీడియాతో మాట్లాడుతూ.. సమావేశంలో తెలంగాణ గౌడ సంఘం ప్రధాన కార్యదర్శి ప్రశాంత్‌గౌడ్, ఉపాధ్యక్షులు నాచగోని రాజయ్యగౌడ్, ప్రతాప లింగంగౌడ్, అఖిల భారత గౌడ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు వేములయ్యగౌడ్, జాతీయ కార్యదర్శి మల్లేశంగౌడ్, మహిళా వరింగ్ ప్రెసిడెంట్ చింతల పద్మగౌడ్, సిటీ జనరల్ సెక్రెటరీ అనిల్‌గౌడ్ పాల్గొన్నారు.
గెల్లును గెలిపించుకుందాం
అంబాల నారాయణగౌడ్ పిలుపు
ఖైరతాబాద్, ఆగస్టు 11: తెలంగాణ ఉద్యమంలో పనిచేసిన గెల్లు శ్రీనివాస్‌యాదవ్‌కు టీఆర్ఎస్ హుజూరాబాద్ టికెట్ ఇవ్వడం హర్షణీయమని గౌడ, బీసీ ఐక్య సాధన సమితి అధ్యక్షుడు అంబాల నారాయణగౌడ్ పేర్కొన్నారు. గెల్లు శ్రీనివాస్‌యాదవ్‌ను గెలిపించుకోవాలని, అభివృద్ధికి పట్టం కట్టాలని కోరారు. బుధవారం సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. తెలంగాణకు సీఎం కేసీఆర్ టీమ్ లీడర్ వంటివారని, అలాంటి నేత వందేండ్లయినా దొరకరని, ఆయన మార్గనిర్దేశంలో ముందు కు సాగుతామని చెప్పారు. సమావేశంలో సంఘం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ భిక్షపతి, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బీ రాజరాజుగౌడ్, సలహాదారులు ప్రసాద్‌గౌడ్, యూత్ వర్కింగ్ ప్రెసిడెంట్ పర్కాల రజినీకాంత్‌గౌడ్ తదితరులు పాల్గొన్నారు.
గెల్లుకే రజకుల మద్దతు
రజకులకు 250 యూనిట్ల ఉచిత విద్యుత్తు, ఎమ్మెల్సీ పదవినిచ్చి గుర్తించిన ఏకైక సీఎం కేసీఆర్. హుజూరాబాద్‌లో గెల్లుకే మద్దతు.
ఆంజనేయులు, తెలంగాణ రజక సంఘాల సమితి సలహాదారు
నాయీ బ్రాహ్మణులకు ఉచిత కరెంటు
నాయీ బ్రాహ్మణులకు 250 యూనిట్ల కరెంటు ఉచితంగా అందిస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణే. గెల్లుకు అందరూ ఓటేయాలి.
రాచమల్ల బాలకృష్ణ, నాయీ బ్రాహ్మణ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు
కుమ్మరులకు ఆధునిక యంత్రాలపై శిక్షణ
సీఎం కేసీఆర్ కుమ్మరులను ప్రాధాన్యం ఇచ్చారు. కుమ్మరి సంఘం తరఫున సీఎం కేసీఆర్‌కు హుజూరాబాద్ విజయాన్ని కానుకగా ఇస్తాం.
మల్కాజిగిరి దయానంద్, రాష్ట్ర కుమ్మర సంఘం ప్రధాన కార్యదర్శి
బీసీలంతా టీఆర్ఎస్ వైపే
బీసీలకు టికెట్ కేటాయించిన టీఆర్ఎస్కే సంపూర్ణ మద్దతును ప్రకటిస్తున్నాం. ప్రతి బీసీ వ్యక్తి కారు గుర్తుకే ఓటు వేయాలని విజ్ఞప్తి.
కోలా శ్రీనివాస్ పూసల, సంచార జాతుల సంఘం అధ్యక్షుడు
బీసీలను పట్టించుకున్నది కేసీఆరే
ఆత్మగౌరవ భవనం కోసం రెండెకరాలు, రెండు కోట్ల నిధులు ఇచ్చారు. హుజూరాబాద్ ఎన్నికల్లో గెల్లును గెలిపించుకొంటాం.
విజయేంద్ర సాగర్, అఖిల భారత సగర మహాసభ అధ్యక్షుడు
బీసీలకు ప్రాధాన్యం
మేరు కులస్థులను పట్టించుకున్న ఏకైక ప్రభుత్వం టీఆర్ఎస్ మాత్రమే. గెల్లును హుజూరాబాద్‌లో గెలిపించుకొంటాం.
వాడపల్లి మాధవ్ మేరు, మేరు సంఘం రాష్ట్ర కార్యదర్శి
ఉద్యమకారులకు సముచిత గౌరవం
ఉద్యమనాయకుడికి సీఎం కేసీఆర్ సముచిత గౌరవమిచ్చారు. ఆలయ పాలకమండళ్లలో బీసీలకు రిజర్వేషన్లను కల్పించారు.
కొండూరు సత్యనారాయణ, ఎంబీసీ రాష్ట్ర కో-కన్వీనర్
సీఎం కేసీఆర్‌కు కృతజ్ఞతలు
హుజూరాబాద్ టీఆర్ఎస్ అభ్యర్థిగా ఉద్యమకారుడు గెల్లును ఎంపిక చేసినందుకు సీఎం కేసీఆర్‌కు కృతజ్ఞతలు .
అశోక్ దూసరి, అధ్యక్షుడు, టీఆర్ఎస్ ఎన్నారై యూకే
చారాణా బీసీ ఈటల
చారాణా బీసీ అయిన ఈటల రాజేందర్‌తో పోరులో నిఖార్సయిన బీసీ గెల్లు శ్రీనివాస్ విజయం సాధిస్తాడు.
రాజారాం యాదవ్, ఓయూ జేఏసీ వ్యవస్థాపక అధ్యక్షుడు