హైదరాబాద్, డిసెంబర్ 18 (నమస్తే తెలంగాణ) : భారత ఎన్నికల ప్రధాన కమిషనర్(సీఈసీ)జ్ఞానేశ్‌కుమార్ శుక్రవారం మధ్యాహ్నం 12 గంటలకు హైదరాబాద్ రానున్నారు. 20న నగరంలోని పలు చారిత్రక, సాంస్కృతిక ప్రాధాన్యంగల ప్రాంతాలను సందర్శించనున్నారు.
21న సాలార్జంగ్ మ్యూజియాన్ని సందర్శించి, ఆ తర్వాత రాష్ట్ర బూత్‌స్థాయి అధికారుల (బీఎల్వోలు)తో రవీంద్రభారతి ఆడిటోరియంలో ఏర్పాటుచేసిన సమావేశంలో పాల్గొంటారు. 22న ఢిల్లీ వెళ్లనున్నారు.