హైదరాబాద్, జూన్ 30 (నమస్తే తెలంగాణ): పట్టణ ప్రగతి కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి సీడీఎంఏ సత్యనారాయణ విశేష కృషి చేశారని మున్సిపల్, పట్టణాభివృద్ధిశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అర్వింద్‌కుమార్ అన్నారు. మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్, పట్టణాభివృద్ధిశాఖ సంచాలకులు (సీడీఎంఏ) డా.ఎన్ సత్యనారాయణ శుక్రవారం పదవి విరమణ చేశారు. ఈ సందర్భంగా సచివాలయంలో మున్సిపల్‌శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అర్వింద్‌కుమార్, మున్సిపల్‌శాఖ ఉన్నతాధికారులు సత్యనారాయణను సన్మానించారు. జీహెచ్ఎంసీ కమిషనర్ లోకేశ్‌కుమార్ రాష్ట్ర అదనపు ప్రధాన ఎన్నికల అధికారిగా నియమితులైన సందర్భంగా ఆయనను జలమండలి ఎండీ దానకిశోర్, మున్సిపల్‌శాఖ అదనపు కార్యదర్శి వాంకుడోతు సైదా, ప్రజారోగ్య విభాగం ఈఎన్సీ శ్రీధర్, పలువురు మున్సిపల్ అధికారులు, సిబ్బంది ఆయనను సన్మానించారు.
రేరా చైర్మన్‌గా బాధ్యతల స్వీకరణ
సీడీఎంఏ పదవీ విరమణ చేసిన ఎన్ సత్యనారాయణ శుక్రవారం సాయంత్రం రేరా చైర్మన్‌గా బాధ్యతలు స్వీకరించారు.