ఓయూలో సీసీటీవీ ఆధారిత హాజరు
హాజరు నమోదుకు చేతివేళ్లు పెట్టాల్సిన పనిలేదు.. కండ్లను స్కాన్ చేయాల్సిన అవసరం అంతకన్నా లేదు. కేవలం నడుచుకొంటూ వెళ్తే చాలు.. ఆటోమేటిక్‌గా హాజరు నమోదవుతుంది. ఇలాంటి అధునాతన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మెషిన్ లర్నింగ్ సీసీ కెమెరాల ఆధారిత హాజరు విధానాన్ని ప్రతిష్ఠాత్మక ఉస్మానియా యూనివర్సిటీ ప్రవేశపెట్టింది.
హైదరాబాద్, ఏప్రిల్ 16 (నమస్తే తెలంగాణ) : హాజరు నమోదుకు చేతివేళ్లు పెట్టాల్సిన పనిలేదు.. కండ్లను స్కాన్ చేయాల్సిన అవసరం అంతకన్నా లేదు. కేవలం నడుచుకొంటూ వెళ్తే చాలు.. ఆటోమేటిక్‌గా హాజరు నమోదవుతుంది. ఇలాంటి అధునాతన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మెషిన్ లర్నింగ్ సీసీ కెమెరాల ఆధారిత హాజరు విధానాన్ని ప్రతిష్ఠాత్మక ఉస్మానియా యూనివర్సిటీ ప్రవేశపెట్టింది. ప్రయోగాత్మకంగా ఓయూ పరిపాలన భవనంలో ఈ తరహా హాజరు విధానాన్ని అమలుచేస్తున్నారు.
ఈ విధానం సఫలీకృతమైతే తదుపరి రోజుల్లో వర్సిటీలోని కాలేజీలు, హాస్టళ్లు, ఇతర కార్యాలయాల్లోను అమలుచేస్తారు. విద్యార్థులు, ఫ్యాకల్టీ ఉదయం, సాయంత్రం బయోమెట్రిక్ హాజరు నమోదుచేసి, మిగిలిన సమయంలో క్లాస్‌లకు డుమ్మాకొట్టే చాన్స్ ఉన్నది. తాజా సీసీ టీవీ ఆధారిత విధానంలో ఈ అవకాశముండదు. కాలేజీ నుంచి ఏ సమయంలో వెళ్లినా పసిగట్టేలా అధునాతన టెక్నాలజీని అధికారులు వినియోగిస్తున్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

