మరికల్ : తెలంగాణకు చెందిన యువకుడు డీజిల్ దొంగతనానికి వెళ్లి సజీవదహన మయిన ఘటన ఏపీలో చోటు చేసుకుంది. నారాయణపేట జిల్లా ( Narayanapet District) మరికల్ మండలం బుడ్డగాని తండాకు చెందిన రవి నాయక్(27) ఆంధ్రప్రదేశ్ ( Andhra Pradesh ) లోని అనంతపూర్ జిల్లా గుత్తి మండలం కొత్తపల్లి గ్రామ సమీపంలో డీజిల్ దొంగతనానికి( Diesel Theft ) వెళ్లి సజీవ దహనమయ్యాడు ( Burnt Alive ) .
గుత్తి సీఐ రామారావు, కొత్తపల్లి ఎస్సై సురేష్ తెలిపిన వివరాల మేరకు.. మరికల్ మండలంలోని బుడ్డగాని తండాకు చెందిన రవి నాయక్, గాజులయ్య తండా చెందిన రవి నాయక్, జూడో నాయక్ కారులో డీజిల్ దొంగతనానికి అనంతపూర్ జిల్లాకు వెళ్లారు. గురువారం తెల్లవారుజామున వీరు ప్రయాణిస్తున్న కారు లారీని ఢీకొనడంతో రవినాయక్ కారులోనే సజీవదహనం కాగా మరో రవి నాయక్, జూడో నాయక్ ప్రమాదం నుంచి తప్పించుకున్నారు.
గత కొన్ని రోజులుగా గాజులయ్య తండా, బుడ్డగాని తండా చెందిన యువకులు అంతర్రాష్ట్ర ప్రధాన రహదారిపై డీజిల్ దొంగతనాలకు వెళ్తున్నారని, గతంలో ఈ తండాకు చెందిన మరో యువకుడు రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడని గ్రామస్థులు వెల్లడించారు.