Bhupalapally | గణపురం : జయశంకర్ భూపాలపల్లి జిల్లా గణపురం మండల కేంద్రంలోని జడ్పీ పాఠశాలలో ఏర్పాటు చేసిన 147 పోలింగ్ కేంద్రంలో సీసీ కెమెరా మాయమైంది. మరో 24 గంటల్లో పార్లమెంట్ ఎన్నికలు జరగనుండగా, సీసీ కెమెరా మాయమవడంతో అధికారులు తర్జనభజన పడుతున్నారు. 147వ పోలింగ్ కేంద్రంలోని రూమ్లో తలుపు పక్కన రెండు రోజుల క్రితం అధికారులు సీసీ కెమెరాను ఏర్పాటు చేశారు. వేసిన తాళం వేసినట్లే ఉండగా సీసీ కెమెరా మాత్రం మాయమవ్వడం అధికారులకు అంతుపట్టడం లేదు. ఈ ఘటనపై స్థానిక ఎస్సైకి అధికారులు ఫోన్ ద్వారా సమాచారం అందజేశారు.