సైదాబాద్, జూన్ 15: సింగరేణిలో బొగ్గు కుంభకోణాలపై సీబీఐతో విచారణ జరిపించాలని మాజీ మంత్రి మహమూద్ అలీ డిమాండ్ చేశారు. సోమవారం చంచల్‌గూడ జైలులో ఉన్న మాజీ విప్ బాల్క సుమన్‌ను బీఆర్ఎస్ మలక్‌పేట ని యోజకవర్గ సభ్యత్వ నమోదు ఇన్చార్జి మహ్మద్ ఆజం అలీ, వక్ఫ్‌బోర్డు మాజీ చైర్మన్, పాతబస్తీ బీఆర్ఎస్ పార్టీ నాయకులు మసిఉల్లాఖాన్ ములాఖత్‌లో కలిశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సింగరేణిలో అక్రమాలను ప్రశ్నించినందుకే సుమన్‌ను అక్రమంగా అరెస్ట్ చేశారని మండిపడ్డారు.