హైదరాబాద్, జూలై 26 (నమస్తే తెలంగాణ) : ఐటీ రిటర్న్స్ విషయంలో రాష్ట్ర ఆదాయపు పన్నుశాఖ సీనియర్ ట్యాక్స్ అసిస్టెంట్ కమర్ ఔలంఖాన్పై సీబీఐ ఎఫ్ఐఆర్ నమోదు చేసింది. హైదరాబాద్‌కు చెందిన ఆనంద్ రామస్వామి నుంచి రూ.15 వేలు లంచం తీసుకున్నట్టు సీబీఐ గుర్తించింది.
గతేడాది నవంబర్ 7న ఐటీఆర్‌లో వ్యత్యాలు ఉన్నాయని, వాటిని బయటపెట్టకుండా ఉండేందుకు కమర్ ఔలంఖాన్ తన నుంచి రూ.15 వేలు లంచం తీసుకున్నట్టు రామస్వామి సీబీఐకి ఫిర్యాదు చేశాడు. ఈ మేరకు సీబీఐ ప్రాథమిక ఆధారాల ద్వారా లంచం తీసుకున్నట్టు ధ్రువీకరించి శుక్రవారం కేసు నమోదు చేసింది.
మరో 463 మంది గ్రామ కార్యదర్శుల రెగ్యులరైజ్
హైదరాబాద్, జూలై 26 (నమస్తే తెలంగాణ) : రాష్ట్రంలో మరో 463 మంది జూనియర్ పంచాయతీ కార్యదర్శులను రెగ్యులరైజ్ చేస్తూ పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ కమిషనర్ అనితా రామచంద్రన్ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. నాలుగు సంవత్సరాల సర్వీసు పూర్తి చేసిన వారిని, నేరుగా రాత పరీక్ష ద్వారా నియమితులైనవారిని రెగ్యులరైజ్ చేస్తున్నారు.