హనుమకొండ జిల్లా శాయంపేట మండలం పెద్దకొడెపాకలో మంగళవారం భారీ కొండచిలువను పట్టుకున్నారు. శివారులోని మంచి నీటి బావిలో మూడున్నర మీటర్ల పొడవైన కొండచిలువను స్థానికులు గుర్తించారు.
అటవీ అధికారులు రెస్యూ టీం సారథ్యంలో బావిలో నుంచి కొండ చిలువను బయటకు తీసి, సంచిలో బంధించి అడవిలో వదిలేశారు. – శాయంపేట