హైదరాబాద్, అక్టోబర్ 29(నమస్తే తెలంగాణ) : కేంద్ర ప్రభుత్వం వచ్చే ఏడాది చేపట్టనున్న జనాభా లెక్కల్లో కులగణన చేయాలని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్య డిమాండ్ చేశారు. ఈ మేరకు ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. జేడీయూ, టీడీపీ, అప్నాదళ్, కాంగ్రెస్, వామపక్ష పార్టీలతోపాటు ఆర్ఎస్ఎస్, ప్రజాసంఘాలు ఈ దిశగా డిమాండ్ చేస్తున్నట్టు గుర్తుచేశారు. సుప్రీంతోపాటు 20 రాష్ర్టాల హైకోర్టులు కులగణనకు అనుకూలంగా తీర్పునిచ్చిన నేపథ్యంలో కేంద్రం సానుకూల నిర్ణయం తీసుకోవాలని కోరారు.
హైదరాబాద్, అక్టోబర్ 29 (నమస్తే తెలంగాణ) : రాష్ట్రంలో కుల గణన తర్వాతే స్థానిక ఎన్నికలు నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ప్రస్తుత పరిస్థితుల్లో జనవరి తర్వాత లోకల్‌బాడీ ఎన్నికలు నిర్వహించాలన్న ఆలోచనలో రాష్ట్ర ఎన్నికల సంఘం ఉంది. వచ్చే నెల 6 నుంచి కులగణన ప్రారంభించనున్నట్టు ప్రభుత్వం ప్రకటించింది.