నాగర్‌కర్నూల్, ఆగస్టు 21 : నాగర్‌కర్నూల్ మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్‌రెడ్డితో మరో 38 మంది బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలపై పోలీసులు కేసు నమోదు చేశారు. కల్యాణలక్ష్మి పథకాన్ని కొనసాగించాలని కోరుతూ గురువారం నాగర్‌కర్నూల్ జిల్లా కేంద్రంలో బీఆర్ఎస్ ఆధ్వర్యంలో శాంతియుతంగా నిరసన తెలిపారు. అనుమతి లేకుండా ధర్నా చేశారని, ప్రధాన రహదారిని దిగ్బంధించి ప్రజారవాణాకు, ప్రజలకు ఆటంకం కలిగించారని మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్‌రెడ్డితో మరో 38 మందిపై పోలీసులు కేసులు నమోదు చేశారు.