మొయినాబాద్, మార్చి 18 : బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌పై రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ ఠాణాలో 193, 352 సెక్షన్ల కింద కేసు నమోదైంది.
సీఎం రేవంత్‌రెడ్డి ఫొటోలను బీఆర్ఎస్ నాయకులు మార్ఫింగ్ చేసి సోషల్ మీడియాలో పెట్టి అసత్య ప్రచారం చేశారంటూ నాలుగు రోజుల క్రితం మొయినాబాద్ మండల కాంగ్రెస్ అధ్యక్షుడు మాణెయ్య ఫిర్యాదు చేశారు.