మెదక్ అర్బన్, జూన్ 16 : మెదక్ పట్టణంలో(Medak) శనివారం రాత్రి ఇరువర్గాల మధ్య జరిగిన ఘర్షణలో 45 మందిని గుర్తించి, అందులో 9 మందిని అరెస్ట్ చేసి, 3 కేసులు నమోదు(Case registered) చేసినట్లు మల్టీజోన్ ఐజీ రంగనాథ్(IG Ranganath) తెలిపారు. ఆదివారం మెదక్ పట్టణ పోలీస్స్టేషన్లో మీడియాకు ఆయన వివరాలు వెల్లడించారు. పండుగలు ప్రశాంత వాతావరణంలో జరుపుకోవాలన్నారు.
ఎవరూ రెచ్చగొట్టే విధంగా ప్రవర్తించవద్దన్నారు. సామాన్య ప్రజలను ఇబ్బంది పెట్టవద్దని కోరారు. మరికొంత మందిని రిమాండ్ చేసే అవకాశాలు ఉన్నాయని తెలిపారు. పశువులు తరలిస్తున్నట్లు సమాచారం ఉంటే పోలీసులకు తెలపాలని సూచించారు. ఎవరూ కూడా చట్టాన్ని చేతిలోకి తీసుకోవద్దని, ఎంత వారైనా ఉపేక్షించేది లేదని హెచ్చరించారు. అనంతరం శాంతి కమిటీ సమావేశం నిర్వహించారు.