ఇంధన కొరతపై ఎన్హెచ్ఆర్సీలో కేసు.. దక్షిణాదిలో కొరత ప్రభావం
ఇంధన కొరత వల్ల ప్రజల ఇబ్బందులు, వినియోగదారుల హక్కుల ఉల్లంఘన, ప్రజాప్రయోజనా ల పరిరక్షణ కోసం తాను చేసిన ఫిర్యాదుపై జాతీయ మానవ హక్కుల కమిషన్ (ఎన్హెచ్ఆర్సీ) కేసు నమోదు చేసిందని తమిళనాడు తెలుగు యువశక్తి వ్యవస్థాపక అధ్యక్షుడు కేతిరెడ్డి జగదీశ్వర్‌రెడ్డి మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు.
- చర్యలకు సుప్రీంకోర్టు లీగల్‌సెల్, కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాలకు కేతిరెడ్డి వినతిపత్రాలు
హైదరాబాద్, ఏప్రిల్ 28 (నమస్తే తెలంగాణ) : ఇంధన కొరత వల్ల ప్రజల ఇబ్బందులు, వినియోగదారుల హక్కుల ఉల్లంఘన, ప్రజాప్రయోజనా ల పరిరక్షణ కోసం తాను చేసిన ఫిర్యాదుపై జాతీయ మానవ హక్కుల కమిషన్ (ఎన్హెచ్ఆర్సీ) కేసు నమోదు చేసిందని తమిళనాడు తెలుగు యువశక్తి వ్యవస్థాపక అధ్యక్షుడు కేతిరెడ్డి జగదీశ్వర్‌రెడ్డి మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. తెలంగాణ, ఏపీ, తమిళనాడుతోపాటు దేశంలోని కొన్ని ప్రాంతాల్లో నెలకొన్న అంశాలపై ఈ కేసు నమోదు చేసినట్టు పేర్కొన్నారు. ఇదే అంశంపై కేంద్ర పెట్రోలియం శాఖ, సుప్రీంకోర్టు లీగల్ సెల్, రాష్ట్ర ప్రభుత్వాలకూ వినతిపత్రాలు అందచేసినట్టు తెలిపారు.
పెట్రోల్, డీజిల్, ఎల్పీజీ కొరతతో ప్రజల్లో భయాందోళనలు నెలకొంటున్నాయని, అత్యసవర సేవలపైనా తీవ్ర ప్రభావం పడుతుందని ఆందోళన వ్యక్తంచేశారు. పెట్రోల్, డీజిల్, ఎల్పీజీ అనేవి విలాస వస్తువులు కాదని, ఇవి ప్రజల దైనందిన జీవనం, జీవనోపాధి, వ్యవసాయం తదితర వ్యవస్థలకు మూలాధారమని పేర్కొన్నారు. దీని ప్రభావం అంబులెన్సులు, ప్రజారవాణా, వ్యవసాయం, ఆహార పదార్థాల సరఫరా, గృహావసరాలు, పరిశ్రమలు, సేవలు వంటి పలు రంగాలపై ప్రభావం పడుతుందని ఆందోళన వ్యక్తంచేశారు. ఈ విషయంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు దృష్టి సారించాలని, ఇంధన కొరత నివారణకు వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Karthik Subbaraj | చిరంజీవి గారికి కథ చెప్పాను.. ఇంకా ఫైనలైజ్ కాలేదు: డైరెక్టర్ కార్తీక్ సుబ్బరాజ్
ఆడపడుచుల ఆత్మగౌరవం.. ప్రకృతి ప్రేమకు ప్రతీక బతుకమ్మ : పద్మా దేవేందర్ రెడ్డి
Crops | ట్యాంకర్లతో నీటి కొనుగోలు.. అయినా తీరని సాగునీటి కష్టాలు
Chiranjeevi | ‘జైలర్ 2’ సినిమాటోగ్రాఫర్‌కు చిరంజీవి అభినందనలు.. ‘కాకా’ సెట్స్‌లో ప్రత్యేక వేడుక!
Madhya Pradesh | మధ్యప్రదేశ్‌లో భక్తులపై దూసుకెళ్లిన భారీ ట్రక్కు 12 మంది మృతి.. పలువురికి తీవ్ర గాయాలు
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్

