బంజారాహిల్స్,అక్టోబర్ 13: బతుకమ్మ సందర్భంగా నిర్దేశిత సమయం దాటిన తర్వాత కూడా డీజే సౌండ్స్ ఉపయోగించిన ఘటనలో నగర మేయర్ గద్వాల్ విజయలక్ష్మితోపాటు మరో ఇద్దరు వ్యక్తులపై బంజారాహిల్స్ పోలీసులు కేసు నమోదు చేశారు.
ఈ నెల 10న సద్దుల బతుకమ్మ సందర్భం గా బంజారాహిల్స్ రోడ్ నం.12 లోని ఎన్బీనగర్లో మేయర్ విజయలక్ష్మి ఆధ్వర్యంలో భారీ ఎత్తున వేడుకలు నిర్వహించారు. రాత్రి 11.45 గంటల తర్వాత కూడా డీజే సౌండ్స్ పెట్టడంతో స్థానిక పోలీసులు అడ్డుకునే ప్రయత్నం చేశారు. ఈ వీడియోలు వైరల్ కావడం తో పోలీసులు సుమోటోగా నిర్వాహకు లు విజయ్‌కుమార్, గౌస్‌తోపాటు మేయర్ గద్వాల్ విజయలక్ష్మిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.