సిరిసిల్ల రూరల్, జూన్ 19 : రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి మండలం అంకుసాపూర్ మాజీ ఎంపీటీసీ కర్కబోయిన కుంటయ్య ఆత్మహత్యకు కారకులైన వ్యక్తులపై ఎట్టకేలకు పోలీసులు కేసు నమోదుచేశారు.
మంగళవారం దవాఖానలో జడ్జికి ఇచ్చిన మరుణవాంగ్మూలంతోపాటు కుంటయ్య భార్య విజయ ఫిర్యాదుమేరకు తంగళ్లపల్లికి చెందిన కాంగ్రెస్నేత గంగ కిష్టారెడ్డి, సిరిసిల్లకు చెందిన మల్యాల నాగరాజుపై కేసు నమోదుచేసినట్టు ఎస్ఐ రామ్మోహన్ తెలిపారు.