Apple iPhone 17 e : యాపిల్ బ్రాండ్ లవర్స్ ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న కొత్త ఐఫోన్ ఈ నెలలోనే విడుదల కానుంది. ఐఫోన్ 17ఈ పేరుతో అందుబాటు ధరలో ఫోన్‌ను ఈ నెల 19న విడుదల చేయనున్నట్లు సమాచారం. ఇప్పటికే మార్కెట్లో ఉన్న ఐఫోన్లు ఎక్కువ ఖరీదు అనే సంగతి తెలిసిందే. అందువల్ల అందరికీ కొనుగోలుకు అవకాశం ఉండేలా ఒక ఫోన్‌ను యాపిల్ సంస్థ రిలీజ్ చేస్తుంటుంది.
దీనిలో భాగంగా ఐఫోన్ 17ఈ ఫోన్ మార్కెట్లోకి రానుంది. ఈ ఫోన్ డిజైన్ ఇంతకుముందు వచ్చిన ఐఫోన్ 16ఈ ఫోన్‌కు దగ్గరలో ఉంటుంది. ఈ ఫోన్ డిస్ప్లేపై డైనమిక్ ఐలాండ్ ఉంటుంది. అలాగే మ్యాగ్‌సేఫ్ టెక్నాలజీ ద్వారా 25 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. ఇంతకుముందు ఉన్న 16ఈ మోడల్ ఫోన్ స్లోగా ఛార్జ్ అయ్యేది. కానీ, 17ఈ మోడల్ మాత్రం వేగంగా ఛార్జ్ అయ్యేలా తీర్చిదిద్దారు. ఈ ఫోన్‌కు వెనుకవైపు సింగిల్ కెమెరా మాత్రమే ఉంటుంది. కొత్త తరం సీ1ఎక్స్ మోడెమ్, ఏ19 చిప్సెట్ వాడారు. ఓలెడ్ డిస్ప్లేతోనే ఈ ఫోన్ రానుంది.
అందుబాటు ధరలో యాపిల్ బ్రాండ్ వాడాలనుకునేవారిని లక్ష్యంగా చేసుకుని ఈ ఫోన్ రాబోతుంది. దీని ధర దాదాపు రూ.60,000 వరకు ఉండొచ్చని అంచనా. ఇప్పటివరకు దీనిపై అధికారిక ప్రకటన లేనప్పటికీ.. 19న విడుదల కావడం ఖాయమని టెక్ నిపుణులు అంచనా వేస్తున్నారు.