హనుమకొండ చౌరస్తా : కాకతీయ విశ్వవిద్యాలయం భౌతికశాస్త్ర విభాగంలో రుసా ప్రాజెక్ట్‌లో
భాగంగా కొత్తగా నిర్మించిన ఆధునిక ల్యాబ్‌లను విశ్వవిద్యాలయ వైస్ చాన్సలర్ ప్రొఫెసర్ కర్నాటి ప్రతాప్‌రెడ్డి ( VC Pratap Reddy ) ప్రారంభించారు. మాలిక్యూల్స్, మెటీరియల్స్ విశ్లేషణ కోసం 12 అత్యాధునిక ఇన్స్ట్రుమెంట్స్ ఇన్స్టాల్ చేసినట్లు వెల్లడించారు.
ల్యాబ్‌ల ఏర్పాటకు రూ.1.7 కోట్లు ఖర్చు అయినట్లు సెంటర్ ఫర్ మాలిక్యూల్స్ అండ్ మెటీరియల్స్ ఫిజిక్స్ డైరెక్టర్ ప్రొఫెసర్ బి.వెంకట్రామరెడ్డి తెలిపారు. ఫిజిక్స్, కెమిస్ట్రీ, ఫార్మసీ, లైఫ్ సైన్సెస్ విభాగాల విద్యార్థులు, పరిశోధకుల కోసం అందుబాటులో ఉంటాయని వెల్లడించారు.
ఆధునిక సౌకర్యాల ద్వారా నూతన పదార్థాల విశ్లేషణ, పరిశోధన, వినూత్న అప్లికేషన్ల అభివృద్ధి చేసేందుకు ల్యాబ్‌లు ఉపయోగపడుతాయన్నారు. కార్యక్రమంలో రిజిస్ట్రార్ ప్రొఫెసర్ వల్లూరి రామచంద్రం, డీన్ జి.హనుమంత్, ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ టి.మనోహర్, సహాబోధనా, బోధనేతర సిబ్బంది, పరిశోధకులు, విద్యార్థులు పాల్గొన్నారు.